వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమ్మెకు ఆపేశారు, '108' చుక్కలు చూపించింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 108 అత్యవసర వాహన సేవల ఉద్యోగులు సమ్మెను విరమించారు. ఆదివారం సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో ఉద్యోగ సంఘ ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి.

108 వాహన సేవల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ సత్వరమే రూ.వెయ్యి రూపాయల వరకూ వేతనాలు పెంచుతామని, ఉద్యోగులు పేర్కొంటున్న ఇతర డిమాండ్ల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీంతో సంతృప్తి చెందిన 108 సిబ్బంది సమ్మెను విరమించారు.

108 సిబ్బంది

108 సిబ్బంది

వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, కార్మిక చట్టాల అమలు, తొలగించిన ఉద్యోగులను తిరిగి తీసుకోవడం.. తదితర 15 డిమాండ్లతో ఈ నెల 13వ తేదీన అర్ధరాత్రి నుండి 108 సిబ్బంది సమ్మె బాట పట్టారు.

108 సిబ్బంది

108 సిబ్బంది

ఉద్యోగుల సంక్షేమ సంఘం.. ఆధ్వర్యంలో 11 రోజుల పాటు ఈ సమ్మె కొనసాగింది. ఆదివారం నాడు మంత్రితో చర్చల అనంతరం ముగించారు.

108 సిబ్బంది

108 సిబ్బంది

ఆదివారం ఉదయం సచివాలయంలో ఎమ్మెల్యే వినయ భాస్కర్, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ గెజిటెడ్ అదికారులు సంఘం చైర్మన్ జూపల్లి రాజేందర్, వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంకషేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అహ్మద్, ఐకాస ప్రతినిధి నారాయణ తదితరులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

108 సిబ్బంది

108 సిబ్బంది

సమ్మెను విరమించేందుకు సిబ్బంది అంగీకరించారని ఈ సందర్భంగా మంత్రి లక్ష్మా రెడ్డి ప్రకటించారు. ఉద్యమంలో కలిసి పోరాడామని, పునర్నిర్మాణంలోను కలిసి ముందుకు సాగాలనే 108 సిబ్బంది ఉద్యోగులు సానుకూలంగా స్పందించారన్నారు.

కాగా, మెదక్ జిల్లా రేగోడు మంజలం గజ్వాడ శివారులో ఆదివారం సాయంత్రం ఆటో - జీపు ఢీకొన్నాయి. ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో ఎక్కించి, మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చారు.

108 సిబ్బంది సమ్మెలో ఉండటంతో తాత్కాలికంగా నియమితులైన వారు గంటపాటు ప్రయత్నించినా తలుపులు రాలేదు. దీంతో క్షతగాత్రులు అందులోనే అల్లాడిపోయారు. చివరికి తాళాలు బాగు చేసే వ్యక్తితో తలుపులు తెరిపించడంతో, అందరు ఊపిరి పీల్చుకున్నారు. వారు గంట పాటు వాహనంలోనే ఉన్నారు.

English summary
The 11-day strike claimed several lives due to the unavailability of the ambulance facility on time, though the GVK-EMRI tried to run vehicles with temporary staff.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X