హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

3డీ స్కాన్ చేస్తూ ఏటీఎం దోపిడీలు: ఇద్దరు యువకుల అరెస్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని శ్రీనగర్ కాలనీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంలోని డేటాను దొంగిలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ కె.వెంకటేశ్వర్‌రెడ్డి కథనం ప్రకారం.. విజయవాడలోని గాయత్రీనగర్‌కు చెందిన వై ఆదిత్య(24) వెంగళరావునగర్‌లో ఉంటున్నాడు.

కాగా, ఇతడి స్నేహితుడు విజయవాడ కాంతయ్యవీధికి చెంది తాళ్ల సతీష్‌(29). ఆదిత్య బీబీఎం చదవగా, సతీష్‌ ఇంజినీరింగ్‌ చేశాడు. అయితే, వీరి సాంకేతిక పరిజ్ఞానాన్ని చోరీల వైపు మళ్లించారు. ఏటీఎంల సమాచార చోరీకి యత్నించారు.

2 Youths Try To Steal Bank Customers Data Using 3D Scanner

ఆదిత్య ఇటీవల చైనాకు చెందిన త్రీడీ స్కానర్‌ను రూ.1.50లక్షలతో కొనుగోలు చేశాడు.దీంతో సెప్టెంబర్ నెల 23న రాత్రి శ్రీనగర్‌కాలనీలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఏటీఎంలో ఏటీఎం కీబోర్డు, కార్డు పెట్టే ప్రాంతం, బిల్‌ వచ్చే ప్రాంతాన్ని క్షుణ్నంగా స్కాన్‌ చేసే పనిలో నిమగ్నమయ్యాడు.

2 Youths Try To Steal Bank Customers Data Using 3D Scanner

ఆరు నిమిషాల నిడివిలో వీడియో రికార్డు చేశాక సెంట్రల్‌ సర్విలెన్స్‌ ఏజెన్సీ సిబ్బంది అతని పనులను అనుమానించారు. వెంటనే అలారం మోగించారు. దీంతో ఏటీఎంలోనే ఉన్న ఆదిత్య, బయట ఉన్న సతీష్‌ కంగారుగా పరిగెత్తబోగా అతనివద్ద ఉన్న స్కానర్‌ కింద పడింది.

ఇది గమనించిన కాపలదారుడు ఈ విషయాన్ని బ్యాంకు మేనేజర్‌ సీతారామారావుకు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చేలోపు నిందితులు కారులో పరారయ్యాడు. అప్పటి నుంచి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం శ్రీనగర్‌కాలనీ శాలివాహననగర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అరెస్ట్‌ చేశారు.

2 Youths Try To Steal Bank Customers Data Using 3D Scanner

వీరి నుంచి ల్యాప్‌టాప్‌, ఐపాడ్‌, త్రీడీ స్కానర్‌, రిఫ్లెక్టివ్‌ షీట్‌, గేర్‌ వీఆర్‌ మేక్‌ ఆక్యులస్‌, రెండు ఖరీదైన చరవాణులు, కారును స్వాధీనం చేసుకున్నట్లు డీఐ వెంకటేశ్వర్‌రెడ్డి వివరించారు. డీఎస్సైలు అన్వేష్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, నిందితులపై గతంలో చైతన్యపురి, బేగంపేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

English summary
Two youths were arrested on Wednesday for trying to steal data by using a 3D scanner at Punjab National Bank ATM, Srinagar colony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X