ఆగని ఆర్డర్లీ: మద్యం తాగుతూ హోంగార్డుతో మసాజ్ చేయించుకున్న సీఐ

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: పోలీసు వ్యవస్థలు ఎన్నో సంస్కరణలు అమలవుతున్నప్పటికీ ఆర్డర్లీ వ్యవస్థ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇందుకు తాజా ఉదాహరణ సరూర్‌నగర్ సీఐ లింగయ్య వ్యవహారాన్ని చెప్పుకోవచ్చు.

మద్యం సేవిస్తున్న సీఐ లింగయ్య.. యూనిఫాంలో ఉన్న ఓ హోంగార్డుతో మసాజ్ చేయించుకున్నారు. అయితే, ఈ వ్యవహారం ఎవరో కెమెరాలో రికార్డ్ చేయి బహిర్గతం చేయడంతో బయటికి వచ్చింది.

A ci being massage with a home guard

ఉన్నతాధికారులకు కింది స్థాయి కానిస్టేబుళ్లు, హోంగార్డులను తమ సొంత పనులకు వాడుకోవద్దని పలుమార్లు ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నప్పటికీ ఈ విధానం మారకపోవడం గమనార్హం.

కాగా, సీఐ లింగయ్యపై ఉన్నతాధికారులకు హోంగార్డుల సంఘం ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటనపై విచారణకు ఆదేశించి చర్యలు తీసుకునేందుకు ఆదేశాలిచ్చారు ఉన్నతాధికారులు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hyderabad Saroornagar CI being massage with a home guard.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి