వీడు మామూలోడు కాదు: టెక్కీ డబ్బు దోచేశాడు?, కానీ ఎలా అన్నదే మిస్టరీ..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: రూమ్ మేట్‌గా ఉంటానంటూ వచ్చిన ఓ వ్యక్తి.. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను బురిడీ కొట్టించాడు. మాటలతో నమ్మించి.. చేతల్లో తన దొంగ తెలివితేటలను ప్రదర్శించాడు. ఏకంగా రూ.49,900 కాజేశాడు. మొత్తం వ్యవహారంలో తానే ఈ నేరానికి పాల్పడినట్టు వారికీ ఎక్కడా అనుమానం రాకుండా చేశాడు. ఎట్టకేలకు అతన్ని పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ.. అతను డబ్బులు కాజేసిన విధానం మాత్రం మిస్టరీగానే ఉండిపోయింది.

రూమ్ మేట్‌ కోసం ప్రకటన..:

రూమ్ మేట్‌ కోసం ప్రకటన..:

హర్ష్‌ కరీవాల, వన్ష్‌ దత్తా, ఆకాశ్‌ గార్గ్‌ ఈ ముగ్గురు స్నేహితులు. హైటెక్ సిటీ ప్రాంతంలో ఐటీ ప్రొఫెషనల్స్‌గా పనిచేస్తున్న ఈ ముగ్గురు ఒకే ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నారు. వీరు ఉంటున్న ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ నుంచి ఇటీవలే ఓ స్నేహితుడు వెళ్లిపోవడంతో.. మరో రూమ్ మేట్‌ను తెచ్చుకోవాలనుకున్నారు. ఇందుకోసం హర్ష్‌, వన్ష్‌ 'హైదరాబాద్‌ ఫ్లాట్‌ అండ్‌ ఫ్లాట్‌ మేట్స్‌' అనే ఫేస్‌బుక్‌ పేజ్‌లో ఒక ప్రకటన పోస్ట్ చేశారు.

సంప్రదించిన శ్రీనివాసరెడ్డి:

సంప్రదించిన శ్రీనివాసరెడ్డి:

హర్ష్‌, వన్ష్‌ల ప్రకటన చూసి.. అదే రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో ఓ యువకుడు వారికి ఫోన్ చేశాడు. ఆ తర్వాత 10నిమిషాల్లోనే వారి ఫ్లాట్ వద్దకు చేరుకున్నాడు. తన పేరు శ్రీనివాసరెడ్డి అని, తిరుపతికి చెందిన తాను ఢిల్లీ, పుణేల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేశానని, పది రోజుల క్రితం హైదరాబాద్‌లోని గూగుల్‌ కార్యాలయంలో యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ డెవలపర్‌గా ఉద్యోగం వచ్చిందంటూ పరిచయం చేసుకున్నాడు. ఫ్లాట్ అంతా చూసి తనకు నచ్చింది.. త్వరలోనే దిగుతానని మాటిచ్చాడు. అద్దెకు, ఇతరత్రా ఖర్చులకు ఓకె చెప్పడంతో.. హర్ష్, వన్ష్ లు కూడా అతన్ని బాగానే నమ్మారు.

డెబిట్ కార్డు దొంగతనం:

డెబిట్ కార్డు దొంగతనం:

హర్ష్, వన్ష్ ల ఫ్లాట్‌కు రావడమే ఆలస్యం.. తన సెల్ ఫోన్ స్విచ్చాఫ్ అయిందని చార్జర్ తీసి చార్జింగ్ పెట్టాడు శ్రీనివాసరెడ్డి. అద్దె, అడ్వాన్సు వివరాలు అన్నీ ఓకె చేసుకున్నాక.. కాలకృత్యాలు తీర్చుకోవాలని చెప్పి వాష్ రూమ్ వెళ్లాడు. ఆ సమయంలో హర్ష్‌, వన్ష్‌ హాల్‌లోనే ఉండిపోయారు. దీన్నే అదనుగా భావించి.. అక్కడి వార్డ్‌రోబ్‌లో ఉన్న హర్ష్‌ పర్సు నుంచి అతడి డెబిట్‌ కార్డు దొంగిలించాడు శ్రీనివాసరెడ్డి. ఏమి ఎరుగనట్టు బయటకొచ్చి.. ఒక కాల్ చేసుకుంటానని చెప్పి వారి నుంచి ఫోన్ తీసుకున్నాడు. సిగ్నల్స్ సరిగా లేవని వారి నుంచి కాస్త దూరం వెళ్లి.. ఆపై ఏదో ఎస్ఎంఎస్ పంపిస్తున్నట్టు టైప్ చేయడం మొదలుపెట్టాడు. కానీ నిజానికి అతను ఓ బగ్గింగ్‌ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేశాడు. వచ్చిన పని పూర్తయిందనుకున్నాక.. ఫోన్ వారికి ఇచ్చేసి.. రెండు రోజుల్లో చేరతానని చెప్పి వెళ్లిపోయాడు.

భారీ మొత్తంలో డబ్బు డ్రా..:

భారీ మొత్తంలో డబ్బు డ్రా..:

ఫ్లాట్ నుంచి బయటకు వెళ్లిన నిమిషాల వ్యవధిలనే శ్రీనివాసరెడ్డి ఆ డెబిట్ కార్డు నుంచి డబ్బు డ్రా చేశాడు.హర్ష్‌ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసిన బగ్గింగ్‌ యాప్‌ ద్వారా డెబిట్ కార్డు పిన్ నంబర్ తెలుసుకోగలిగాడు. అంతేకాదు, తాత్కాళికంగా డెబిట్ ట్రాన్సాక్షన్స్ వివరాలు తన సెల్ ఫోన్ నంబర్‌కే వచ్చేలా ఆ యాప్‌ను ఉపయోగించుకున్నాడు. దీంతో శ్రీనివాసరెడ్డి రూ.49,900 డ్రా చేసిన విషయం కూడా హర్ష్ కు తెలియలేదు. రాత్రి 10గం. తర్వాత ఆలస్యంగా.. హర్ష్ సెల్‌ఫోన్‌కు డబ్బు డ్రా చేసినట్టు మెసేజ్‌లు వచ్చాయి. ఫోన్‌ డేటా పరిశీలించగా.. అందులో బగ్గింగ్ యాప్ ఇన్ స్టాల్ అయినట్టు గుర్తించారు.

 ఎట్టకేలకు అరెస్ట్.. కానీ అది మాత్రం మిస్టరీయే?:

ఎట్టకేలకు అరెస్ట్.. కానీ అది మాత్రం మిస్టరీయే?:

ఫ్లాట్ కి వచ్చిన శ్రీనివాసరెడ్డే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటాడని మరుసటి రోజు గచ్చిబౌలి పోలీసులకు హర్ష్, వన్ష్ లు ఫిర్యాదు చేశారు. దీంతో టెక్నాలజీ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితుడిని వరంగల్ వాసిగా గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే నిందితుడు ఎలాంటి బగ్గింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేయలేదని పోలీసులు చెప్పడం గమనార్హం.

హర్ష్ ఫోన్‌ ద్వారా తాత్కాలిక పిన్‌ నంబర్‌ సృష్టించి, డబ్బు డ్రా చేసిన సమయంలో తన ఫోన్ కే మెసేజ్ వచ్చేలా చేశాడని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు బ్యాంకు అధికారులు మాత్రం.. టెంపరరీ పిన్‌ నంబర్‌ జనరేషన్‌ సాధ్యం కాదని అంటున్నారు. దీంతో దీని వెనకాల అసలు మిస్టరీ ఏంటన్నది బయటపడలేదు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Srinivas Reddy, who cheated two software engineers and stolen their debit card has arrested by Madapur police on Thursday

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి