టెక్కీ హత్య కేసులో ట్విస్ట్: అక్రమ బంధం, సుపారి ఇచ్చి హత్య చేయించింది భార్యే

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టెక్కీ నాగరాజు హత్య కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి జీవించాలనే ఉద్దేశంతో నాగరాజు భార్య జ్యోతి తన ప్రియుడు కార్తీక్‌తో కలిసి ఈ హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. జ్యోతి సుపారి ఇవ్వడంతో కార్తీక్.. దీపక్, నరేష్ అనే మరో ఇద్దరు యువకులతో కలిసి నాగరాజును హత్య చేసినట్లు తేలింది.

మరో షాక్: గజల్ శ్రీనివాస్‌పై వేటు, 20వీడియోలు, వెనకేసుకొచ్చిన ఏపీ మంత్రి, నన్నపనేని ఆశ్చర్యం

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నాగరాజును జ్యోతి హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు. కార్తీక్, నరేష్, దీపక్‌లు డిసెంబర్ 31న రాత్రి హైటెక్ సిటీ సమీపంలో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత మృతదేహాన్ని నల్గొండలోని చెరువులో పడేశారు. కాగా, నరేష్ ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో ఈ హత్య ఘటనకు సంబంధించిన అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

హత్య ఇలా వెలుగులోకి

హత్య ఇలా వెలుగులోకి

హత్య ఘటనలో పాలుపంచుకున్న నరేష్ అనే యువకుడు గురువారం లాలాగూడలో బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని గుర్తించిన స్థానికులు 108కు కాల్‌ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో గాంధీ ఆస్పత్రిలో చేర్పించిన అతన్ని పోలీసులు విచారించగా ఈ హత్య గురించి వెల్లడైంది. నేరం బయటపడుతుందని, ఈ హత్యానెపాన్ని తనమీద మోపుతారేమోనన్న భయంతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు నిందితుడు నరేష్ తెలిపాడు.

అడ్డుగా ఉన్నాడనే..

అడ్డుగా ఉన్నాడనే..


దీపక్, అతని స్నేహితులు కార్తీక్.. హైటెక్‌ సిటీలో సమీపంలో నాగరాజు అనే సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను చంపాలనుకున్నారు. తన ప్రేమకు అడ్డు వస్తున్నాడనే కోపంతో కార్తీక్‌, తన స్నేహితులు దీపక్, నరేష్‌తో కలిసి టెక్కీని మట్టుబెట్టాలని నిర్ణయించాడు. ఇందుకుగాను హైటెక్ సిటీలోని అతని గదికి వెళ్లిన నిందితులు.. నిద్రమాత్రలు ఇచ్చి టెక్కీని హత్య చేశారు.

అమ్మాయి ప్రేమ ఇష్యూ: టెక్కీని హత్య చేసిన యువకులు, ఇలా వెలుగులోకి

ఆత్మహత్యాయత్నంతో..

ఆత్మహత్యాయత్నంతో..


కాగా, హత్య అనంతరం మృతదేహాన్ని నల్గొండ జిల్లాలోని ఓ చెరువులో పడేశారు. ఈ ఘటనలో పాలుపంచుకున్న దీపక్‌ స్నేహితుడు నరేశ్ తాజాగా గురువారం లాలాగూడలో గొంతు కోసుకోవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో నాగరాజు హత్యకు పాల్పడిన కార్తీక్, దీపక్, నరేశ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

లోతుగా దర్యాప్తు

లోతుగా దర్యాప్తు

టెక్కీ నాగరాజు హత్య కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని నార్త్ జోన్ డీసీపీ సుమతి చెప్పారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటు చేసుకుంటుండుటం గమనార్హం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman allegedly killed her husband with help of paramour in madhapur in Hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి