Nizamabad: అమ్మాయిని ప్రేమించాడు.. 3 నెలల కింద కనిపించకుండా పోయాడు.. కట్ చేస్తే శవమై తేలాడు..
పిల్లలంటే తల్లిదండ్రులకు ఎంతో ఇష్టం ఉంటుంది. చాలా మంది తమ పిల్లలే లోకంగా బతుకుతారు. తమ పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ ఓ తల్లి కలలు కలలుగానే మిగిలిపోయాయి. తండ్రి ఆశలు నిరాశలుగా మిగిలిపోయాయి. ఆ కొడుకు వారిని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేక హత్య చేశారో తెలియక ఆ తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు.

సెప్టెంబర్ 23న
నిజామాబాద్ జిల్లా ఖండ్‌గావ్‌కి చెందిన లక్ష్మణ్ రావు- శివజ్యోతి దంపతులకు కుమారుడు శ్రీకాంత్ ఉన్నాడు. అతను బోధన్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు.సెప్టెంబర్ 23న రోజులాగే కాలేజికి వెళ్లిన శ్రీకాంత్ సాయంత్రం ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు బంధువులు, అతని స్నేహితలను అడిగారు. అయినా ఆచూకీ లభించలేదు. దీంతో వారు వెంటనే పోలీసులు ఫిర్యాదు చేశారు.

ఆచూకీ
కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం గాలించారు. అయినా ఆచూకీ దొరకలేదు. దీంతో శ్రీకాంత్ తల్లిదండ్రులు పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల వద్ద తమ కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకోవాలని వేడుకున్నారు. అయినా శ్రీకాంత్ ఎక్కడికి వెళ్లాడో తెలియలేదు. రెండు రోజుల క్రితం బోధన్-రుద్రూర్ ప్రధాన రహదారి పక్కన పసుపు వాగు ఒడ్డున కుళ్లిపోయిన స్థితిలో శ్రీకాంత్ మృతదేహం లభించింది.

ఆత్మహత్య
అతను ఉరేసుకున్నట్టుగా ఘటనాస్థలంలో చెట్టుకు తాడు, కింద చెప్పులు, సంచి కనిపించాయి. శ్రీకాంత్ మృతితో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. తమ కొడుకుని హత్య చేశారని.. దీనిపై విచారణ చేయాలని బోధన్-రుద్రూర్ రహదారిపై బైఠాయించారు. శ్రీకాంత్‌ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అదే కళాశాలలోనే చదివే అమ్మాయి, శ్రీకాంత్ ప్రేమించుకున్నారని చెప్పారు.

ధర్నా
ఇది ఇష్టంలేని అమ్మాయి కుటుంబ సభ్యులు శ్రీకాంత్‌ను బెదిరించారని మృతుడి బంధువులు ఆరోపించారు. కాగా.. ఆర్డీవో రాజేశ్వర్, డీసీపీ అరవింద్‌బాబు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అన్ని అంశాలను పరిగణలోకి విచారణ చేస్తామని ఎవ్వరినీ ఉపేక్షించమని... ఆర్డీవో హామీ ఇచ్చారు. హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని... కుటుంబ సభ్యుల ఆరోపణ మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు కేసును అప్పగిస్తున్నామని డీసీపీ హామీ ఇచ్చారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications