హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డీఈ శ్రీధర్ ఇళ్లపై ఎసిబి దాడులు, రూ.2.50 కోట్ల ఆస్తులు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణల నేపథ్యంలో మేడ్చల్ నార్త్ సర్కిల్ విద్యుత్తు ఆపరేషన్స్ డీఈ భోగ శ్రీధర్ ఇళ్లు, కార్యాలయం పైన ఎసిబి అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు.

అక్రమ ఆస్తులు భారీగా ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేశారు. ఎసిబి డిఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ... బల్కంపేటకు చెందిన శ్రీధర్ మేడ్చల్లోని విద్యుత్ శాఖలో పని చేస్తున్నారని చెప్పారు.

శ్రీధర్ 1993లో ఏఈగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. బల్కంపేటలోని శ్రీధర్‌ ఇంటితో పాటు సమీపంలోని ఆయన ఇద్దరు సోదరుల ఇళ్లపై, మేడ్చల్‌లోని కార్యాలయంపై సిరిసిల్ల, కరీంనగర్‌లోని ఇళ్లపై, తీగలగుట్టపల్లిలోని అత్తవారి ఇంటిపై తెల్లవారుజామున నుంచి సాయంత్రం వరకు సోదాలు చేశారు.

 ఎసిబి దాడులు

ఎసిబి దాడులు

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణల నేపథ్యంలో మేడ్చల్ నార్త్ సర్కిల్ విద్యుత్తు ఆపరేషన్స్ డీఈ భోగ శ్రీధర్ ఇళ్లు, కార్యాలయం పైన ఎసిబి అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు.

ఎసిబి దాడులు

ఎసిబి దాడులు

ఆరు బ్యాంకు ఖాతాలతో పాటు శ్రీధర్‌ భార్య ఉమాదేవి పేరిట రెండు లాకర్లు, బల్కంపేటలో రూ.86లక్షల విలువచేసే జి ప్లస్3 భవనం, సిరిసిల్లలో జి ప్లస్3 భవనం, 2 ఇళ్ల స్థలాలు, కరీంనగర్‌లో 2 ఇళ్ల స్థలాలు, 2 కార్లు, 50 తులాల బంగారు ఆభరణాలు, రూ.15లక్షల నగదు, రూ.15లక్షల విలువచేసే జీవిత బీమా పాలసీలు, వడ్డీకిచ్చిన రూ.15లక్షలతో కలిపి రూ.2.50 కోట్ల మేర విలువ చేసే ఆస్తులున్నట్లు గుర్తించారు.

ఎసిబి దాడులు

ఎసిబి దాడులు


శ్రీధర్‌ భార్య పేరిట ఉన్న బ్యాంకు లాకర్లలో కిలో బంగారం, కిలో వెండి, రూ.లక్ష నగదు ఉన్నట్లు గుర్తించామని ఎసిబి అధికారులు చెప్పారు. వీటి విలువను లెక్క కట్టాల్సి ఉందన్నారు.

ఎసిబి దాడులు

ఎసిబి దాడులు

ఎసిబి కరీంనగర్‌ రేంజి డీఎస్పీ సుదర్శన్ గౌడ్‌ ఆధ్వర్యంలో సిరిసిల్లలో ఎసిబి సీఐ వేణుగోపాల్‌ తదితరులు కరీంనగర్‌, సిరిసిల్లలో దాడులు నిర్వహించారు. శ్రీధర్‌ స్వస్థలం, అత్తవారింట్లో లభించిన పత్రాలను, తనిఖీల నివేదికను హైదరాబాద్‌కు పంపినట్లుగా తెలుస్తోంది.

English summary
ACB Raids Electric DE Sridhar House in Balkampet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X