షూటింగ్‌లో బిజీ: కోర్టుకు యాంకర్ ప్రదీప్ డుమ్మా

Posted By:
Subscribe to Oneindia Telugu
  కోర్టుకు ప్రదీప్ డుమ్మా, హాజరైన యాంకర్ రవి !

  హైదరాబాద్: డ్రంకెన్ డ్రైవ్ కేసులో యాంకర్ ప్రదీప్ కోర్టు డుమ్మా కొట్టారు. ఆయన బుధవారంనాడు కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే, షూటింగ్‌లో బిజీగా ఉన్న కారణంగా తాను కోర్టుకు హాజరు కాలేకపోతున్నట్లు ఆయన ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

  తాను షూటింగ్‌లో బిజీగా ఉన్నానని సమాచారం ఇవ్వడంతో ఆయన కోర్టుకు హాజరు కారనే భావిస్తున్నారు. యాంకర్ ప్రదీప్ డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన విషయం తెలిసిందే. అనంతరం జరిగిన కౌన్సిలింగ్‌లో తన తండ్రితోపాటు పాల్గొన్నాడు.

  కోర్టుకు ఇదివరకే హాజరు కావాల్సి ఉండింది

  కోర్టుకు ఇదివరకే హాజరు కావాల్సి ఉండింది

  మంగళవారమే ప్రదీప్ హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో హాజరుకావాల్సి ఉంది. అయితే కేసుకు సంబంధించిన నివేదికలు కోర్టుకు అందడంలో జరిగిన జాప్యంతో బుధవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.

  ప్రదీప్‌కు సమాచారం ఇచ్చారు...

  ప్రదీప్‌కు సమాచారం ఇచ్చారు...

  బుధవారం కోర్టుకు హాజరు కావాలనే సమాచారాన్ని ప్రదీప్‌కు ట్రాఫిక్ పోలీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను షూటింగ్‌లో బిజీగా ఉన్నానని పోలీసులకు ప్రదీప్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మంగలవరం ఆయన కోర్టుకు హాజరయ్యే విషయంపై సందిగ్ధం ఏర్పడింది.

  చివరు కౌన్సెలింగ్‌కు వచ్చారు

  చివరు కౌన్సెలింగ్‌కు వచ్చారు

  డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ప్రదీప్ దాదాపు వారం రోజుల తర్వాత పోలీసుల ముందుకు వచ్చాడు. డిసెంబర్ 31 రాత్రి మద్యం తాగి వాహనాలు నడిపినవారికి వారి తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే ప్రదీప్ కౌన్సెలింగ్‌కు హాజరుకాలేదు. తాను ఎక్కడికీ పారిపోలేదని అంటూ ఓ వీడియోనువిడుదల చేశాడు. త్వరలోనే కౌన్సెలింగ్‌కు హాజరవుతానని ఆ వీడియోలో చెప్పిన ప్రదీప్ చివకు సోమవారం పోలీసులు ముందుకు వచ్చాడు.

  ప్రదీప్ ఇలా పట్టుబడ్డారు...

  ప్రదీప్ ఇలా పట్టుబడ్డారు...

  డిసెంబర్ 31న రాత్రి బ్రీత్ ఎనలైజర్ టెస్టులో ప్రదీప్‌కు 178 పాయింట్లు వచ్చాయి. ఆ కేసుతో పాటు కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉండడంపై ప్రదీప్‌పై మరో కేసు కూడా నమోదు అయింది. ఈ నేపథ్యంలో ప్రదీప్‌ బుధవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉండింది.

  రెండు రోజులు గడువు కోరిన ప్రదీప్

  రెండు రోజులు గడువు కోరిన ప్రదీప్

  తాను షూటింగ్‌లో బిజీగా ఉండలం వల్ల కోర్టుకు హాజరు కాలేక పోతున్నానని చెబుతూ మరో రెండు రోజులు గడువు ఇవ్వాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. ప్రదీప్‌ వినతిని పరిగణలోకి తీసుకున్న హైదరాబాద్‌ పోలీసులు రెండు రోజుల అనంతరం విచారణకు హాజరవ్వాలని ఆదేశించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Anchor Pradeep may not attend to the court today in drn and drive case due to busy in shooting.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి