మరో సంఘటన: భర్తను చంపిన భార్య, ఎందుకంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన భర్తను చంపిన సంఘటన చోటు చేసుకుంది. ఇటీవలి కాలంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే.

అక్కడే దొరికిపోయారు.. విచారణలో షాక్ !

కట్టుకున్న భర్తను తలదిండుతో ఊపిరాడకుండా చేసి మహిళ చంపేసింది. ఈ సంఘటన నల్లగొండ ిల్లా కొండమల్లెపల్లి మడలం ఏపూరు తండాలో చోటు చేసుకుంది.

వారికి పదమూడేళ్ల క్రితం పెళ్లి

వారికి పదమూడేళ్ల క్రితం పెళ్లి

ఏపూరు తండాకు చెందిన సోమకు నాగర్‌కర్నూలుకు చెందిన భారతితో పదమూడేళ్ల క్రితం వివాహమైంది. వారికి పదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, గత కొన్నేళ్లుగా భారతిలో మార్పు వచ్చింది.

భర్త హెచ్చరించినా...

భర్త హెచ్చరించినా...

భారతిలో వచ్చిన మార్పును గమనించి సోమ పలుమార్లు హెచ్చరించాడు కూడా. అయినా ఆమెలో మార్పు రాలేదు. రెండు రోజులకు ఒకసారి ఊరికి వెళ్తూ ఉండేది. ఫోన్‌లో ఎక్కువ సేపు మాట్లాడుతూ ఉండేది. దీంతో ఇరువురికి తరచుగా గొడవలు జరుగుతూ వచ్చాి.

మద్యానికి బానిసయ్యాడు...

మద్యానికి బానిసయ్యాడు...

భార్యలో మార్పు రాకపోవడంతో సోమ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఇరువురికి మధ్య మరోసారి గొడవ జరిగింది. అర్థరాత్రి దిండుతో ఊపిరాడకుండా చేసి ఆమె భర్తను చంపేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు తన భర్త మరణించాడని అందరికీ చెప్పింది.

అసలు విషయం ఇలా బయటపడింది...

అసలు విషయం ఇలా బయటపడింది...

ఇంటి పక్కవాళ్లు సోమ మృతదేహాన్ని పరిశీలించారు. సోమ గొంతుపై గాయాలు కనిపించాయి.అనుమానం వచ్చి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు అక్కడికి చేరుకుని భారతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In another incident wife Bharati killled her husband Soma in Nalgonda district of Telangana.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి