గజల్ శ్రీనివాస్‌కు మరో షాక్, వేటు: 'రాత్రి 10 తర్వాత గదిలోకి, కోరికలు తీర్చమని వేధింపు, గడియ పెట్టి'

Posted By:
Subscribe to Oneindia Telugu
  గజల్ శ్రీనివాస్‌పై వేటు: వెనకేసుకొచ్చిన ఏపీ మంత్రి, 20 వీడియోలు

  హైదరాబాద్: మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న గాయకుడు గజల్ శ్రీనివాస్‌కు మరో షాక్. సేవ్ టెంపుల్‌కు ఆయన ప్ర‌చార‌క‌ర్త‌గా ఉన్నాడు. ఆరోపణలు, అరెస్టు నేపథ్యంలో ఆయ‌న‌ను స‌స్పెండ్ చేస్తూ ఆల‌య అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు.

  సేవ్ టెంపుల్ అధ్య‌క్షులు వెల‌గ‌పూడి ప్ర‌కాశ్ రావు ఈ విషయమై మాట్లాడారు. త‌మ‌ సంస్థ‌ల్లో ప‌నిచేసే మహిళలను దేవ‌త‌ల్లా గౌర‌విస్తామ‌ని చెప్పారు. సంస్థ పేరు అడ్డం పెట్టుకుని ఇటువంటి వికృత కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డితే సహించేది లేదన్నారు. తమ సంస్థ హైందవ ధర్మం కోసం పని చేస్తోందని, ఇటువంటి ఘటన జరగడం విచారకరమన్నారు.

  'బెడ్రూంగా ఆ గది, గజల్ శ్రీనివాస్ బాగోతం వీడియోల్లో, ఆడదానితో ఎంజాయ్ కోసం, ఇలా బయటకు'

  ఏడు రోజుల కస్టడీ కోరిన పోలీసులు

  ఏడు రోజుల కస్టడీ కోరిన పోలీసులు

  గజల్ శ్రీనివాస్ గురించి కొత్త కొత్త విషయాలు, ఆధారాలు వెలుగు చూస్తోన్న విషయం తెలిసిందే. బాధితురాలిని ఆయన వద్దకు పార్వతి పంపినట్లుగా చెబుతున్నారు. మరోవైపు, మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఆయనకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి.

  ఆ గజల్ శ్రీనివాస్ వీడియోలు, కొత్త ఆధారాలు: అమ్మాయి వస్తే

  పోలీసులకు థ్యాంక్స్

  పోలీసులకు థ్యాంక్స్

  తాను ఫిర్యాదు చేసేందుకు వెళ్లినప్పుడు పోలీసులు తనను చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారని, అందుకు తాను థ్యాంక్స్ చెబుతున్నానని బాధితురాలు ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను డిగ్రీ చేశానని, వాయిస్ ఓవర్ శిక్షణ తీసుకున్నానని చెప్పారు. తాను తెలంగాణ జాగృతిలో కూడా పని చేసినట్లు తెలిపారు. ఓ సమయంలో తాను ఉద్యోగం కోసం వెతుకుతున్న సమయంలో సేవ్ టెంపుల్‌లో ఉద్యోగం వచ్చిందన్నారు. తన వయస్సు 29 అని చెప్పారు. తాము బాల వికాస్ విద్యార్థులమని చెప్పారు. తాను సేవ్ టెంపుల్‌కు వెళ్లాకే గజల్ శ్రీనివాస్ ముఖాముఖిగా తెలుసని చెప్పారు.

  జూనియర్ ఆర్టిస్ట్‌లు వచ్చేవారు, డ్యూటీ అయ్యాక ఉండమని

  జూనియర్ ఆర్టిస్ట్‌లు వచ్చేవారు, డ్యూటీ అయ్యాక ఉండమని

  సేవ్ టెంపుల్ మంచి సంస్థ అని, ఆ సంస్థ అధ్యక్షులు మంచివారని, కానీ గజల్ శ్రీనివాస్ మాత్రం దారుణంగా ప్రవర్తించేవారని చెప్పారు. సాయంత్రం ఆరు తర్వాత తమ పని అయిపోయిన తర్వాత ఆయన గదికి పిలిచేవారన్నారు. గజల్ శ్రీనివాస్ సాయంత్రం తమతో అదే పనిగా మాట్లాడే ప్రయత్నాలు చేసేవారని బాధితురాలు చెప్పారు. ఎక్కువ సేపు మాట్లాడటం, పర్సనల్ విషయాలు టచ్ చేసేవాడని చేసేవాడన్నారు. జూనియర్ ఆర్టిస్టులు కూడా వచ్చే వారన్నారు. డ్యూటీ టైం తర్వాత తమను ఉండమని చెప్పడం బాధించేదన్నారు.

  లోపలకు వెళ్లి గడియ పెట్టుకుంటారని చెప్పారు

  లోపలకు వెళ్లి గడియ పెట్టుకుంటారని చెప్పారు

  పార్వతి మద్దతు ఇవ్వదని తనకు ముందే తెలుసునని బాధితురాలు చెప్పారు. గజల్ శ్రీనివాస్, పార్వతిలు లోపలకు వెళ్లి గడియ పెట్టుకుంటారని, చాలాసేపు లోపల ఉంటారని ఆ తర్వాత తనకు తెలిసిందని అన్నారు. దీంతో ఆమె గురించి తనకు తెలిసిందన్నారు. తనను వేధిస్తున్నాడని మరో యువతికి వేధింపులు జరగకుండా ఉండేందుకు తాను స్టింగ్ ఆపరేషన్ చేశానని చెప్పారు. ప్రస్తుతానికి సేవ్ టెంపుల్ లో లేడీస్ లేవన్నారు. తాను జనవరిలో చేరానని, కానీ రెండు నెలల నుంచి వేధింపులు ఎక్కువ అయ్యాయని చెప్పారు.

  బెయిల్ ఇవ్వొద్దు, బెదిరిస్తారు: గజల్ శ్రీనివాస్ ఆకృత్యాలెన్నో, మరిన్ని వీడియోలు

  ఉద్వేగానికి లోనైన బాధితురాలు

  ఉద్వేగానికి లోనైన బాధితురాలు

  తాను బయటకు వెళ్తానంటే బ్లాక్ మెయిల్ చేశారని బాధితురాలు కంటతడి పెట్టారు. ఆయన చూసిన ధోరణిలో వారి వారి అనుభవాలను బట్టి ఎలా చూస్తున్నారో తెలుస్తుందని ఉద్వేగానికి లోనయ్యారు. తాను అక్కడ లాక్ అయిపోయానని చెప్పారు. ఎందుకంటే తనకు ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికేట్ ఇవ్వలేదని చెప్పారు. గజల్ శ్రీనివాస్‌కు పేరు, పలుకుబడి ఉందని కాబట్టి నేను బయట ఆరోపణలు చేస్తే ఎవరూ నమ్మరని, అలాగే మరో మహిళ ఇలా బాధలు పడవద్దని తాను వీడియోలు తీశానని చెప్పారు. తనంతట తానే మసాజ్ చేసినట్లు గజల్ శ్రీనివాస్ చెప్పారని, కానీ అది అవాస్తవమన్నారు. తాను కాళ్లు పట్టుకున్నానని చెప్పారు. కానీ తనను భయపెట్టి, ప్రలోభపెట్టి చేశారా లేదా అనేది ఓ వీడియోలో ఉందని చెప్పారు. వారిద్దరి ప్లాన్, మాటలు, ప్రవర్తన అంతా ఒకటే అన్నారు. ఇద్దరు కలిసి చేస్తారన్నారు.

  విధులు ముగిసినా పని ఉందని ఉండమని చెప్పేవాడు

  విధులు ముగిసినా పని ఉందని ఉండమని చెప్పేవాడు

  గజల్‌ శ్రీనివాస్ తనను ఉద్యోగంలో చేరిన కొద్దిరోజుల నుంచి లైంగికంగా వేధిస్తున్నాడంటూ బాధితురాలు పోలీసులకు వెల్లడించిన విషయం తెలిసిందే. గజల్‌ శ్రీనివాస్‌కు కార్యాలయంలోనే ఓ ప్రత్యేక గది ఉందని చెప్పారు. ఆరు నెలల నుంచి వేధింపుల పర్వం కొనసాగినట్లు వెల్లడించారు. సాయంత్రం ఆరున్నర గంటల నుంచి గంటలకు విధులు ముగిసినా ఇంకా పని ఉందని ఆయన చెప్పేవాడని అన్నారు. తనకు మొదటి నుంచి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ అని చెప్పారు.

  రాత్రి పది తర్వాత గజల్ శ్రీనివాస్ గదికి పార్వతి

  రాత్రి పది తర్వాత గజల్ శ్రీనివాస్ గదికి పార్వతి

  రాత్రి పది తర్వాత ఆయన గదిలోకి పార్వతి వెళ్లేదని, కొద్దిసేపటికి తనను పిలిచేవారని, అప్పటికే గజల్ శ్రీనివాస్‌ పడుకుని ఉండేవాడని, ఆయనకు మర్దన చేయాలని పార్వతి చెప్పేదని, ఒక్కోసారి తనను గదిలోకి పిలిచినప్పుడు గజల్‌ శ్రీనివాస్‌ ఒంటిపై తుండుగుడ్డ మాత్రమే ఉండేదని వాపోయారు.

  కోరికలు తీర్చమని చెప్పేవారు

  కోరికలు తీర్చమని చెప్పేవారు

  కొద్దిరోజుల తర్వాత పార్వతి పిలిచి గజల్‌ శ్రీనివాస్‌కు చాలామంది ప్రజాప్రతినిధులు తెలుసని, ఆయన లైంగిక కోరికలు తీరిస్తే ఎక్కడైనా మంచి ఉద్యోగం ఇప్పిస్తారని పార్వతి చెప్పిందని బాధితురాలు వెల్లడించారు. తాను అందుకు ఒప్పుకోలేదన్నారు. దీంతో అప్పటి నుంచి తీవ్రంగా వేధించడం మొదలు పెట్టారని చెప్పారు. పది రోజుల నుంచి లైంగిక కోర్కెలు తీర్చాలంటూ మరింత ఒత్తిడి చేయడంతో భయంవేసి పోలీసులను ఆశ్రయించానని చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Another shock to singer Ghazal Srinivas on Wednesday. Save Temple removed him.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి