హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బొంతు రామ్మోహన్: ప్రథమ పౌరుడి కుటుంబ ఆస్తుల విలువ ఇది

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర ప్రథమ పౌరుడి కుటుంబ ఆస్తుల విలువ అక్షరాలా 73.90 లక్షలు. తన జీవిత భాగస్వామి, పిల్లల పేరిట స్థిర, చరాస్తులు రూ.73 లక్షలకు పైగా ఉండగా, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో రూ.8 లక్షల అప్పు ఉందని ఎన్నికల అఫిడవిట్‌లో సమర్పించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజక వర్గ పరిధిలోని చర్లపల్లి డివిజిన్ నుంచి టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసిన బొంతు రామ్మోహన్‌ నామినేషన్‌ దాఖలు సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో తనతో పాటు కుటుంబ సభ్యుల స్థిర, చరాస్తుల వివరాలను ఈ విధంగా పొందుపరిచారు.

తన పేరిట చేతిలో నగదు, పాలసీలు, వాహనాలతో కలిపి చరాస్తులు రూ.38.30 లక్షలు ఉందని, భార్య పేరిట పాలసీలు, బంగారం కలిపి రూ.5.75 లక్షలు, ఒక్కో కూతురి పేరిట రూ.50 వేల బంగారం ఉందని పేర్కొన్నారు. మొత్తంగా కుటుంబ సభ్యులతో కలిపి తన చరాస్తులు రూ.45.05 లక్షలు ఉందని చూపారు.

అఫిడవిట్‌లో తనకు ఎలాంటి వ్యవసాయ భూములు లేవని చూపిన రామ్మోహన్‌, అమీర్‌పేటలో రూ.28.85 లక్షల విలువైన 116.66 గజాల నివాస భవనం ఉన్నట్టు పేర్కొన్నారు. బ్యాంకులు, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో తన పేరిట రూ.8 లక్షల రుణాలు ఉన్నాయని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తనపై హైదరాబాద్ మహా నగరంలోని పలు పోలీస్ స్టేషన్‌‌లో కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు.

Assets of New Hyderabad Mayor Bonthu Rammohan

బొంతు రామ్మోహన్‌ పేరిట:

చరాస్తులు రూపాయల్లో
* చేతిలో నగదు - రూ.6,00,000
* బ్యాంకు డిపాజిట్లు - రూ.10,20,158
* పాలసీ(ఎల్‌ఐసీ) - రూ.35,000
* రావాల్సిన రుణాలు - రూ.3,00,000

స్థిరాస్తులు
* అమీర్ పేటలో 116.66 గజాల నివాసం విలువ రూ.28,85,666

వాహనాలు
* టయోటా ఫార్చునర్‌ (ఏపీ-09, సీఏ-9969) - 11,50,000 (విలువ)
* స్విప్ట్‌ కారు(ఏపీ-10, ఏయు-0829)- 2,50,000 (విలువ)
* బంగారం(30 గ్రాములు) రూ.75,000(విలువ)
* ఇతర ఆస్తులు రూ.4,00,000 (విలువ)

భార్య శ్రీదేవీ పేరిట:
* పాలసీలు రూ.75,000
* బంగారం(200 గ్రాములు) రూ.5,00,000

పిల్లలు
* కూజిత పేరిట బంగారం (20 గ్రాములు) రూ.50,000
* ఉషశ్రీ పేరిట బంగారం(20గ్రాములు) రూ.50,000

మొత్తం రామ్మోహన్‌ పేరిట ఉన్న అప్పు రూ.8,00,000
2014-15 ఆర్ధిక సంవత్సరం ఆదాయం రూ.5,25,810

కేసులు:
* జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో- 1401/2009
* మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో- సీసీ 621/2011
* కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌లో- సీసీ 819/2011

English summary
Assets of New Hyderabad Mayor Bonthu Rammohan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X