గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.2 కోట్లు ఇప్పిస్తా: రేవంత్‌రెడ్డిని బురిడీ కొట్టించబోయి... బుక్కయ్యాడు

ప్రధానమంత్రి కృషి యోజన కింద రూ.2 కోట్లు ఇప్పిస్తానని చెప్పి తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని బురిడీ కొట్టించబోయిన వ్యక్తిని జూబ్లిహిల్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రధానమంత్రి కృషి యోజన కింద రూ.2 కోట్లు ఇప్పిస్తానని చెప్పి తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని బురిడీ కొట్టించబోయిన వ్యక్తిని జూబ్లిహిల్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి పేరు బాలాజీ అలియాస్ దేవకుమార్.

రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ప్రధానమంత్రి యోజన కింద రూ.2 కోట్లు ఇప్పిస్తానని, పది శాతం డబ్బు ఇస్తే మంజూరు చేయిస్తానని చెప్పారు. రేవంత్ పీఏ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతని మోసం రట్టయింది.

ఫైనాన్స్ సెక్రటరీ పేరుతో పలువురు రాజకీయ నాయకులు ఫోన్లు చేసి ప్రధానమంత్రి ఎంప్లాయి‌మెంట్ గ్యారెంటీ పథకం కింద కేంద్రం నుంచి భారీ మొత్తంలో నిధులు వచ్చాయని నమ్మబలికాడు.

Balaji alias Devakumar arrested after Revanth Reddy complaint

మీరంటే నాకు అభిమానమని, మీ నియోజకవర్గానికి ఎక్కువ నిధులు ఇప్పించామని, మీరు కొంత నగదు ఇస్తే ఆ నిధులను విడుదల చేయిస్తానని ఎమ్మెల్యేలను నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరకు రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి.. పోలీసులకు దొరికిపోయాడు.

జూబ్లీహిల్స్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అతను దేవరకుమార్ పేరుతో నేతలకు ఫోన్లు చేసి మోసం చేసేందుకు ప్రయత్నించాడు. లక్షా 25 వేలు డిపాజిట్ చేస్తే.. రూ.రెండు కోట్ల నిధులు వస్తాయని నమ్మించాడు.

ఆదివారం రాత్రి 8 గంటలకు అతడి అనుచరుడైన అంకుష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడి ద్వారా దేవకురమార్‌ను ఆలేరుకు రప్పించారు. పకడ్బందీగా ప్లాన్ వేసి అదుపులోకి తీసుకున్నారు.

అతనిపై తెలంగాణ, ఏపీలలో చాలా కేసులున్నాయని పోలీసులు తెలిపారు. 2013 నవంబర్ 1న సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసినట్లు రికార్డుల్లో ఉందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలాజీ ఇలాంటి మోసాలు చాలా చేసినట్లు విచారణలో తెలిసిందన్నారు.

తాజాగా ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర, పొంగులేటిలకు ఫోన్ చేసి డబ్బులు గుంజాడని, చివరిగా రేవంత్‌కు ఫోన్ చేస్తే.. ఆయన పీఏ తమకు సమాచారం ఇవ్వడంతో అతడి గుట్టు బట్టబయలైందన్నారు.

English summary
Balaji alias Devakumar arrested after Revanth Reddy complaint
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X