హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బతుకమ్మ పాట: యువతుల దాండియా(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో బతుకమ్మ సంబరాలు సోమవారం ఘనంగా జరిగాయి. ‘చిత్తూ చిత్తుల బొమ్మ ..శివుని మద్దుల గుమ్మ.. బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, ఒక్కేసి... పూవ్వేసి సందమామో, ఒక్క జామునాయో సందమామో'', ‘‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో'' అన్న పాటలు మొదలుకొని వివిధ రకాల బతుకమ్మ ఆట పాటలతో యువతులు, మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలను జరుపుకుంటున్నారు.

నాంపల్లిలోని ఇందిరాప్రియదర్శిని డిగ్రీ మహిళా కళాశాలలో ఆదివారం నిర్వహించిన బతుకమ్మ సంబరాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా బతుకమ్మ వేడుకలను హైదరాబాద్ జిల్లా ఆర్డీఓ నిఖిల ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆర్డీఓ పరిధిలోని మొత్తం తొమ్మిది మండలాలకు చెందిన మహిళా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

ముమ్మర ఏర్పాట్లు

నగరంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడానికి గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. హుస్సేన్‌ సాగర్‌ పరిసరాల్లో ఐదు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఘాట్‌లు.. రోటరీ పార్కు పరిసరాల గుండా నిర్మించిన మార్గాలు పర్యాటకులను అమితంగా ఆకర్షిసున్నాయి. అక్టోబరు 2వ తేదీన బతుకమ్మ పండుగ కోసం 25 వేల మంది మహిళలు ఎల్‌బీ స్టేడియం నుంచి హుస్సేన్‌ సాగర్‌ మీదుగా ర్యాలీ చేపట్టనున్నారు.

ఈ ర్యాలీని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. ర్యాలీలో పాల్గొనే మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు జీహెచ్‌ఎంసీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. 100 రెడీమేడ్‌ టాయ్‌లెట్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్టు కమిషనర్‌ సోమేష్‌ కుమార్‌ తెలిపారు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రత్యేక విద్యుత్‌ కాంతుల కోసం 10 వేల స్కై ల్యాంపులను వెలిగించనున్నారు. ఇందుకోసం సిబ్బందికి సోమవారం తర్ఫీదు ఇచ్చారు.

బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో..

బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో..

నగరంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలను జరుపుకుంటున్న ఉద్యోగులు.

పౌర సరఫరాల భవన్

పౌర సరఫరాల భవన్

నగరంలోని పౌర సరఫరాల భవన్‌లో ఉత్సాహంగా బతుకమ్మ ఆడుతూ కోలాటం వేస్తున్న మహిళలు.

బిఎస్ఎన్ఎల్ భవన్

బిఎస్ఎన్ఎల్ భవన్

నగరంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలను జరుపుకుంటున్న ఉద్యోగులు.

ఏపి సిపిడిసిఎల్ వద్ద..

ఏపి సిపిడిసిఎల్ వద్ద..

నగరంలోని ఏపి సిపిడిసిఎల్ కార్యాలయం ఆవరణలో బతుకమ్మ వేడుకలను జరుపుతున్న మహిళా ఉద్యోగులు.

టి సచివాలయ ఉద్యోగినులు

టి సచివాలయ ఉద్యోగినులు

తెలంగాణ శాసనసభ సచివాలయ మహిళా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు.

ఉత్సాహంగా..

ఉత్సాహంగా..

తెలంగాణ శాసనసభ సచివాలయ మహిళా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు.

డిబిపిఎం డిగ్రీ కళాశాలలో..

డిబిపిఎం డిగ్రీ కళాశాలలో..

నగరంలోని డిబిపిఎం డిగ్రీ కళాశాలలో దాండియా ఆడుతున్న యువతులు.

యువతుల సందడి

యువతుల సందడి

నగరంలోని డిబిపిఎం డిగ్రీ కళాశాలలో సంప్రదాయ వస్త్రధారణలో దాండియా ఆడుతున్న యువతులు.

డిబిపిఎం డిగ్రీ కళాశాలలో..

డిబిపిఎం డిగ్రీ కళాశాలలో..

నగరంలోని డిబిపిఎం డిగ్రీ కళాశాలలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న యువతులు.

దాండియా సందడి

దాండియా సందడి

నగరంలోని డిబిపిఎం డిగ్రీ కళాశాలలో సంప్రదాయ వస్త్రధారణలో దాండియా నృత్యం చేస్తున్న యువతి.

దాండియా సంబరం

దాండియా సంబరం

నగరంలోని డిబిపిఎం డిగ్రీ కళాశాలలో సంప్రదాయ వస్త్రధారణలో దాండియా ఆడుతున్న యువతులు.

బతుకమ్మ సంబరం

బతుకమ్మ సంబరం

నగరంలోని డిబిపిఎం డిగ్రీ కళాశాలలో సంప్రదాయ వస్త్రధారణలో బతుకమ్మ ఆడుతున్న యువతులు.

జిహెచ్ఎంసి కార్యాలయంలో..

జిహెచ్ఎంసి కార్యాలయంలో..

జిహెచ్ఎంసి కార్యాలయంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కమిషనర్ సోమేశ్ కుమార్.

హెచ్ఎండిఏ వేడుకల్లో దత్తాత్రేయ

హెచ్ఎండిఏ వేడుకల్లో దత్తాత్రేయ

హెచ్ఎండిఏ కార్యాలయంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎంపి బండారు దత్తాత్రేయ.

హెచ్ఎండిఏలో వేడుకలు

హెచ్ఎండిఏలో వేడుకలు

హెచ్ఎండిఏ కార్యాలయంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళా ఉద్యోగినులు.

జలసౌధలో..

జలసౌధలో..

నగరంలోని జలసౌధలో ఉత్సాహంగా బతుకమ్మ ఆడుతున్న యువతులు, మహిళలు.

జలవిహార్‌లో..

జలవిహార్‌లో..

నగరంలోని జల విహార్‌లో భారీ బతుకమ్మను పేర్చి పూజలు చేస్తున్న మహిళలు.

సచివాలయంలో

సచివాలయంలో

తాము పేర్చిన బతుకమ్మలతో వస్తున్న సచివాలయం మహిళా ఉద్యోగినులు.

ఎస్‌సిఈఆర్‌టిలో...

ఎస్‌సిఈఆర్‌టిలో...

‘చిత్తూ చిత్తుల బొమ్మ ..శివుని మద్దుల గుమ్మ.. బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, ఒక్కేసి... పూవ్వేసి సందమామో, ఒక్క జామునాయో సందమామో'' పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతున్న మహిళా ఉద్యోగినులు.

తెలుగు అకాడమీలో..

తెలుగు అకాడమీలో..

తెలుగు అకాడమీలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళా ఉద్యోగినులు.

తెలుగు అకాడమీలో..

తెలుగు అకాడమీలో..

తెలుగు అకాడమీలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళా ఉద్యోగినులు.

రవాణా శాఖ కార్యాలయంలో..

రవాణా శాఖ కార్యాలయంలో..

తిరుమలగిరిలోని రవాణా శాఖ కార్యాలయంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళా ఉద్యోగినులు.

టిఎస్‌సిపిడిసిఎల్‌లో..

టిఎస్‌సిపిడిసిఎల్‌లో..

నగరంలోని టిఎస్‌సిపిడిసిఎల్‌లో ఉత్సాహంగా బతుకమ్మ ఆడుతున్న మహిళలు.

టిఎస్‌సిపిడిసిఎల్‌లో..

టిఎస్‌సిపిడిసిఎల్‌లో..

నగరంలోని టిఎస్‌సిపిడిసిఎల్‌లో బతుకమ్మలో అమ్మవారిని అందంగా అలంకరించిన దృశ్యం.

విద్యుత్ సౌధలో

విద్యుత్ సౌధలో

విద్యుత్ సౌధలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొని ఉత్సాహంగా పాటలుపాడుతున్న మహిళలు, యువతులు.

English summary
Bathukamma celebrations held at various places in Hyderabad on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X