ఒక్క సలహా: నరేంద్ర మోడీని చంద్రబాబు చిక్కుల్లో పడేశారా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని, బీజేపీని చిక్కుల్లో పడేశారా? మోడీని ఇబ్బందుల్లోకి నెట్టారా? అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు.

ఈజీగా వదలడు, చిరంజీవికి-జనసేనకు సంబంధం లేదు: పవన్‌పై నాగబాబు

రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయాలని చంద్రబాబు గత కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని మోడీకి లేఖలు కూడా రాశారు. ఆ తర్వాత మోడీ ఈ నోట్లను రద్దు చేశారు. నోట్ల రద్దుకు చంద్రబాబు కూడా డిమాండ్ చేయడం, తాను కూడా లేఖలు రాశానని చంద్రబాబు పలుమార్లు చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో నోట్ల రద్దులో చంద్రబాబు సలహా కూడా ఎంతో కొంత కనిపిస్తోందనే వాదనలు ఉన్నాయి.

chandrababu naidu

చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు కూడా నోట్ల రద్దు పైన తాము లేఖలు రాసినట్లు చెప్పారు. ఆ తర్వాత నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో చంద్రబాబు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. రద్దయి ఇన్ని రోజులు అయినా ఇంకా సమస్యలు తీరకపోవడం ఏమిటని రివర్స్ అయ్యారు. అదే సమయంలో నోట్ల రద్దు మంచిదేనని, ఇబ్బందులు తాత్కాలికమేనని చంద్రబాబు చెబుతున్నారు.

ఏది ఏమైనా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనిని కాంగ్రెస్ పార్టీ, విపక్షాలు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం లెఫ్ట్ పార్టీ భారత్ బంద్, ఇతర పార్టీలు నిరసనలు తెలిపాయి.

నోట్ల రద్దుతో ప్రజలు అర్థం చేసుకుంటున్నప్పటికీ ఒకింత అసహనం కూడా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో విహెచ్ స్పందించారు.

రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయాలని ప్రధాని మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు సలహా ఇచ్చారని, ఆయన సలహా పాటించి ప్రధాని చిక్కుల్లో పడ్డారని విహెచ్ అన్నారు. గతంలోను వాజపేయికి ముందస్తు ఎన్నికల సలహా ఇచ్చారని అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chandrababu has put Narendra Modi in trouble with note ban advice, as he did with vajpayee by advising early polls, says VH.
Please Wait while comments are loading...