జీవితకు చెక్: సినీ నటి కవిత బిజెపిలో చేరికకు రంగం సిద్దం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సినీ నటి, మాజీ టిడిపి నాయకురాలు కవిత బిజెపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని ప్రచారం సాగుతోంది. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌తో సినీ నటి కవిత సమావేశం కావడం రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకొంది. కవిత బిజెపిలో చేరుతారని ఆ పార్టీ వర్గాలంటున్నాయి.

  Revanth Reddy Says Goodbye To TDP రేవంత్‌తో పాటు 25మంది ? | Oneindia Telugu

  ఈ ఏడాది మే మాసంలో జరిగిన మహనాడులో తనకు అవమానం జరిగిందని సినీ నటి కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మహనాడు ప్రాంగంణం నుండి ఆమె వెళ్ళిపోయారు.

  ఆ తర్వాత చోటుచేసకొన్న పరిణామాల నేపథ్యంలో కూడ కవిత టిడిపి నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. పార్టీ అధికారంలో లేని సమయంలో పార్టీ కోసం తాను కష్టపడ్డాని చెబుతున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నాయకత్వం తనను విస్మరించిందనే అభిప్రాయంతో కవిత ఉన్నారు.

  బిజెపిలో చేరనున్న సినీ నటి కవిత?

  బిజెపిలో చేరనున్న సినీ నటి కవిత?

  సినీ నటి కవిత బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.టిడిపి కార్యక్రమాలకు గత కొంత కాలంగా కవిత దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో టిడిపి నాయకత్వ తీరుపై కవిత బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలోనే కవిత బిజెపి నేత డాక్టర్ లక్ష్మణ్‌తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. ఆమె బిజెపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఆమె పార్టీలో చేరే అవకాశం ఉందని బిజెపి వర్గాలు చెబుతున్నాయి.అయితే ఈ విషయమై బిజెపి నుండి కానీ, కవిత నుండి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

  జీవితకు చెక్

  జీవితకు చెక్

  బిజెపిలో చేరిన సినీ నటి జీవిత రాజకీయాల్లో అంతగా క్రియాశీలకంగా లేరు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి సినీ గ్లామర్ అవసరం కూడ ఉంది. పార్టీలో ఉన్న సినీ నటి జీవిత పార్టీ కార్యక్రమాల్లో చురుకగా పాల్గొనడం లేదని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ తరుణంలో టిడిపిపై అసంతృప్తితో ఉన్న కవిత బిజెపిలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అనుకోని పరిణామం బిజెపికి కలిసివచ్చింది. కవిత టిడిపిని వీడి బిజెపిలో చేరాలని నిర్ణయం తీసుకోవాలని భావించడం పట్ల బిజెపి నాయకత్వం కూడ సానుకూలంగా స్పందించారని సమాచారం.

  నామినేటేడ్ పదవులపై కవిత అసంతృప్తి

  నామినేటేడ్ పదవులపై కవిత అసంతృప్తి

  టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి నుండి పార్టీలో ఉన్న వారి పట్ల పార్టీ నాయకత్వం వ్యవహరించిన తీరు పట్ల సినీ నటి కవిత తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీలో కొత్తగా వచ్చినవారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె పలుమార్లు విమర్శలు ఎక్కుపెట్టారు. పార్టీ వేదికలపై కొత్తగా వచ్చినవారే ఉండడంపై ఆమె మండిపడ్డారు.అదే సమయంలో నామినేటేడ్ పదవుల విషయంలో కూడ పార్టీ నాయకత్వం అనుసరించిన తీరుపై ఆమె అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని టిడిపికి గుడ్‌బై చెప్పాలని కవిత భావించారని అంటున్నారు.

  తెలంగాణలో బలపడేందుకు బిజెపి వ్యూహం

  తెలంగాణలో బలపడేందుకు బిజెపి వ్యూహం

  తెలంగాణలో బలపడాలని బిజెపి నాయకత్వం భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఒంటరిగా పోటీచేయనున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. అయితే ఇతర పార్టీల నుండి బిజెపిలోకి భారీ వలసలు ఉంటాయని ఆ పార్టీ నేతలు గతంలో ప్రకటించారు. అయితే ఇంతవరకు పార్టీలో వలసలు మాత్రం ప్రారంభం కాలేదు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు బిజెపిలో చేరుతారని ఆ పార్టీ నేతలంటున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Tdp leader,cine actress Kavitha may join in Bjp.she met with Bjp president Dr. Laxman on Wednesday at Hyderabad.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి