Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మెస్సీ మేనియా, రేపే రేవంత్ తో మ్యాచ్ - షెడ్యూల్.. వీరికే ఎంట్రీ..!!

హైదరాబాద్ లో మెస్సీ మేనియా కనిపిస్తోంది. ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్ వస్తున్నారు రేపు (శనివారం) ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్‌తో కలిసి మ్యాచ్ ఆడనున్నారు. రా­త్రి 7 నుం­చి 9 వరకు ఉప్ప­ల్‌ స్టే­డి­యం­లో 'మె­స్సీ మాయ' అల­రిం­చ­నుం­ది. తొ­లుత సె­ల­బ్రి­టీ­ల­తో ఎగ్జి­బి­ష­న్‌ మ్యా­చ్‌ ని­ర్వ­హి­స్తా­రు. ఒక జట్టు­కు రే­వం­త్‌­రె­డ్డి..మరో జట్టు­కు మె­స్సీ సా­ర­థ్యం వహి­స్తా­రు. అనం­త­రం యువ ప్ర­తి­భా­వం­తు­ల­తో మె­స్సీ మా­స్ట­ర్‌ క్లా­స్‌ కా­ర్య­క్ర­మం ఉం­టుం­ది. ఆ తర్వాత పె­నా­ల్టీ షూ­టౌ­ట్‌ ని­ర్వ­హి­స్తా­రు. చివరగా మ్యూజి­క­ల్‌ కా­న్స­ర్ట్‌ జరు­గు­తుం­ది.

హైదరాబాద్ గరంలో ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ పర్యటన వేళ పండుగ వాతావరణం కనిపిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా మెస్సీ ఫుట్ బాల్ ఆడనున్నారు . ఇందుకు ఉప్పల్​ స్టేడియం వేదిక కానుంది. క్రీడాకారుడు లియోనల్​ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇమేజ్​, ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి తో కలిసి మ్యాచ్ ఆడనుండటం ఈ పర్యటనలో నే హైలైట్ గా భావిస్తున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు ఉప్పల్​ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను డీజీపీ గురువారం పర్యవేక్షించారు. ప్రేక్షకులు ఎలాంటి నిబంధనలు పాటించాలి, భద్రతా నియమాల గురించి మెట్రోరైళ్లు, ప్రధాన కూడళ్లలో బోర్డులతో ప్రచారం చేయాలని సూచించారు. ట్రాఫిక్​ మళ్లింపు వివరాలు ముందే ప్రచారం చేయాలన్నారు.

cm-revanth-gearing-up-for-a-friendly-football-match-against-lionel-messi-on-13th-at-hyderabad

23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్టేడియంను భద్రతా అవసరాల రీత్యా నాలుగు సెక్టార్లుగా విభజించా ని చెప్పారు. 39 వేల మంది సామర్థ్యానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశామని వివరించారు. ఈనెల 13వ తేదీ సాయంత్రం 4 గంటలకు మెస్సీ శంషాబాద్​ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి బయలుదేరి నేరుగా ఫలక్ నుమా ప్యాలెస్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఉప్పల్​ స్టేడియంలో జరిగే మ్యాచ్​లో పాల్గొననున్నారు. ఒక్క ఉప్పల్​ స్టేడియంలోనే రాచకొండ పోలీసులు సుమారు 2 వేల మందితో బందోబస్తును ఏర్పాట్లు చేస్తున్నారు. వీరికి అదనంగా స్టేడియం లోపల 1000 మంది వాలంటీర్లు విధుల్లో ఉండనున్నారు. శంషాబాద్​ విమానాశ్రయం నుంచి ఫలక్​నుమా ప్యాలెస్​, ఉప్పల్​ స్టేడియం వరకు ప్రయాణించే మార్గాలు ఇప్పటికే ఖరారు అయ్యాయి. 13 తేదీ రాత్రికి ఫలక్ నుమా ప్యాలెస్ లో మెస్సీ బస చేస్తారు.

స్టేడియంలో జరిగే మ్యాచ్ కు టికెట్​లు, పాస్​లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా మెస్సీ సాకర్‌ ఫ్యాన్స్‌ను అలరించనున్నాడు. మెస్సీతో ప్రత్యేకంగా ఫొటో దిగాలనుకునే వారు రూ.10లక్షలు చెల్లించి అవకాశాన్ని సొంతం చేసుకోవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇందుకోసం 100 ప్రత్యేకమైన స్లాట్‌లను ఏర్పాటు చేశారు. ఉప్పల్‌ స్టేడియంలో జరిగే సాకర్‌ మ్యాచ్‌లో సహచర ప్లేయర్లు రోడ్రిగో డీ పాల్‌, లుయిస్‌ సురెజ్‌తో కలిసి మెస్సీ బరిలో దిగనున్నాడు. 20నిమిషాలు జరిగే ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో సింగరేణి ఆర్‌ఆర్‌-9 టీమ్‌, మెస్సీ ఆల్‌స్టార్స్‌ తలపడనున్నాయి. షూటౌట్‌ సెగ్మెంట్‌లో పిల్లలకు మెస్సీ మెళకువలు నేర్పించనున్నాడు. ఉప్పల్‌ స్టేడియంలో మ్యూజికల్‌ కన్సర్ట్‌ ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. రాత్రికి హైదరాబాద్‌లో బస చేసే మెస్సీ..ఆదివారం ముంబైకి బయల్దేరి వెళ్లనున్నాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+