ఆ మంత్రి వేధిస్తున్నారు, పవన్ ఆదుకో, సచివాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయం సి బ్లాక్ ఎదుట దేవేందర్ అనే వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. చికిత్సనిమిత్తం అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

నిర్మల్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన దేవేందర్ భార్య, పిల్లలతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ సచివాలయానికి వచ్చారు.

Devendra suicide attempt in front of C Block Telangana secretariat

 ఆయన సి బ్లాక్ ఎదుట ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. గతంలో గద్వాల్ జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామానికి చెందిన మల్లేష్ అనే రైతు ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలవాలని వచ్చాడు.

కానీ. సిఎంను కలవలేదు.దీంతో ఆయన సి బ్లాక్ ఎదుటే పురుగులమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు సకాలంలో ఆయనను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలతో బతికి బయటపడ్డారు.

పవన్ ఆదుకోవాలి

సచివాలయం సి బ్లాక్ వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించిన దేవేందర్ వద్ద ఓ లేఖను పోలీసులు కనుగొన్నారు.ఈ లేఖలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జేసీ శివలింగయ్యలు మూడేళ్ళ నుండి తన కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపించాడు. తనకు ఉపాధి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ప్రగతి భవన్ ముందుకు సమాధి చేయాలని కోరాడు.

ప్రజారాజ్యం పార్టీ కోసం తన జీవితాన్ని నాశనం చేసుకొన్నానని చెప్పారు. చదువు వదిలేశా, తండ్రి, కొడుకుని పోగొట్టుకొన్నా అంటూ ఆ లేఖలో రాశాడు. చిరంజీవి సోదరులను కలవడానికి చాలాసార్లు ప్రయత్నించా. సిబ్బంది అనుమతించలేదన్నారు. నా బిడ్డలను పవన్ కళ్యాణ్ ఆదుకోవాలని ఆయన ఆ లేఖలో కోరారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Devendra suicide attempt in front of C Block Telangana secretariat on Friday .He is from NIrmal district Timmapur village. Police shifted to him hospital.
Please Wait while comments are loading...