రేవంత్ బాహుబలా? అందుకే కాంగ్రెస్‌లోకి: డీకే అరుణ కీలక వ్యాఖ్యలు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇటీవల టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వ‌చ్చాకే కాంగ్రెస్ పార్టీలో ఊపు వ‌చ్చిందన‌డానికి తాను వ్య‌తిరేక‌మ‌ని డీకే అరుణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

తనకు కాంగ్రెస్ పార్టీ పీసీసీ బాధ్యతను అప్పగిస్తే చేస్తానని అన్నారు. అధిష్టానం ఆదేశిస్తే రేవంత్ నాయకత్వంలో కూడా పనిచేస్తామని డీకే అరుణ చెప్పారు. గద్వాల జిల్లా తమ పోరాటం వల్లే వచ్చిందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరతారని వచ్చిన వార్తలు అవాస్తవలేనని అన్నారు.

బాహుబలి అంటూ..

బాహుబలి అంటూ..

కాంగ్రెస్ పార్టీలోకి బాహుబ‌లి వ‌స్తాడని పలువురు కాంగ్రెస్ నేత‌లు గతంలో వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. కాగా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరాక ఆయ‌నే బాహుబ‌లి అని కొంద‌రు అన్నారు.

కాంగ్రెస్ బలంగా ఉందనే..

కాంగ్రెస్ బలంగా ఉందనే..

తాజాగా డీకే అరుణ ఓ టీవీ ఛానల్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... త‌మ పార్టీలోకి బాహుబ‌లి రావ‌డం ఏంట‌ని, ఇదేమన్నా సినిమానా? అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ బ‌లంగా ఉంద‌నే రేవంత్ రెడ్డి త‌మ పార్టీలోకి వ‌చ్చార‌ని డీకే అరుణ తెలిపారు.

రేవంత్ వల్లేనంటే ఒప్పుకోనూ

రేవంత్ వల్లేనంటే ఒప్పుకోనూ

రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీలో కొత్త ఊపు వచ్చిందనడాన్ని తాను ఒప్పుకోనని అన్నారు. వేరే పార్టీలు ఏవీ బ‌లంగా లేవు కాబ‌ట్టి, తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీయే ప్ర‌త్యామ్నాయం కాబ‌ట్టి రేవంత్ రెడ్డి త‌మ పార్టీలో చేరార‌ని వ్యాఖ్యానించారు.

వ్యతిరేకించలేదు..

వ్యతిరేకించలేదు..

తాను రేవంత్ రెడ్డి రాక‌ను వ్య‌తిరేకించాన‌న్న ప్ర‌చారంలో నిజం లేదని, అస‌త్య‌ ప్ర‌చారం జ‌రిగిందని చెప్పారు. గతంలో తనకు, రేవంత్‌కు మధ్య జరిగిన రాజకీయ గొడవలేనని చెప్పారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతార‌న్న విష‌యాన్ని కొంద‌రు ర‌హ‌స్యంగానే ఉంచారని తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress Senior leader DK Aruna responde on Revanth Reddy baahubali comments.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి