హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రిపీట్ అవొద్దు: పబ్ నిర్వాహకులకు ఘాటు హెచ్చరికలు

డ్రగ్స్ కేసులో పబ్బులే కీలకంగా మారిన నేపథ్యంలో పలు పబ్బుల యజమానులతో ఎక్సైజ్ శాఖ సమావేశం నిర్వహించింది. ఇంతకుముందే నోటీసులు జారీ చేయడంతో సదరు పబ్బుల యజమానులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో పబ్బులే కీలకంగా మారిన నేపథ్యంలో నగరంలోని పలు పబ్బుల యజమానులతో శనివారం ఎక్సైజ్ శాఖ సమావేశం నిర్వహింంచింది. ఇంతకుముందే నోటీసులు జారీ చేయడంతో సదరు పబ్బుల యజమానులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

డ్రగ్స్ సప్లై కేంద్రాలుగా పబ్బులు, బార్లు: నోటీసులందుకున్న పబ్బులివే!డ్రగ్స్ సప్లై కేంద్రాలుగా పబ్బులు, బార్లు: నోటీసులందుకున్న పబ్బులివే!

ఈ సందర్భంగా పబ్బుల నిర్వాహకులకు ఎక్సైజ్ శాఖ నుంచి ఘాటు హెచ్చరికలు వెళ్లినట్లు తెలిసింది. పబ్బులలో డ్రగ్స్ వినియోగం కానీ, అమ్మకం గానీ జరిగితే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పినట్లు సమాచారం.

Telangan excise department on saturday warned pubs owners for drugs issue.

ఇలాంటి చర్యలు మళ్లీ జరగొద్దని గతంలో డ్రగ్స్ కార్యకలాపాలు నిర్వహించిన 17 పబ్బులకు ఈ సందర్భంగా గట్టి హెచ్చరికలు పంపారు. పబ్బుల్లో ఎవరైనా డ్రగ్స్ వాడినా, అమ్మినా.. తమకు వెంటనే తెలియజేయాలని ఆదేశించారు.

మైనర్లను పబ్బుల్లోకి అనుమతించవద్దని పబ్‌ల యజమానులకు తేల్చి చెప్పారు. పబ్బుల్లో డ్రగ్స్ వాడినట్లు తెలిస్తే కేసులు నమోదు చేయడంతోపాటు లైసెన్సులు కూడా రద్దు చేయనున్నట్లు హెచ్చరించారు. డ్రగ్స్ కార్యకలాపాలు పబ్బుల్లో జరగకుండా చూసోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులు తేల్చి చెప్పారని పలువురు పబ్బుల యజమానులు చెప్పారు.

English summary
Telangan excise department on saturday warned pubs owners for drugs issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X