హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రగ్స్ సప్లై కేంద్రాలుగా పబ్బులు, బార్లు: నోటీసులందుకున్న పబ్బులివే!

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది. డ్రగ్స్ వ్యాపారానికి పబ్బులే ప్రధాన కేంద్రాలంటూ వస్తున్న ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు అధికారులు రంగంలోకి దిగారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది. డ్రగ్స్ వ్యాపారానికి పబ్బులే ప్రధాన కేంద్రాలంటూ వస్తున్న ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు అధికారులు రంగంలోకి దిగారు. పబ్బుల్లోనే డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు బాధితులు చెప్పిన వివరాల ఆధారంగా లోతైన దర్యాప్తునకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పలు పబ్బులకు నోటీసులకు కూడా అందజేశారు.

డ్రగ్స్ సప్లైకి కేంద్రాలుగా పబ్బులు

డ్రగ్స్ సప్లైకి కేంద్రాలుగా పబ్బులు

పబ్బులతోపాటు నగరంలోని బార్ల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. పాటించాల్సిన నియమ నిబంధనలు, జరుగుతున్న ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటికే కొంత సమాచారం సేకరించిన అధికారులు.. పబ్బులు, బార్ల యాజమాన్యాలకు తెలియజేయనున్నారు. పబ్బులు కేంద్రంగా అనేక అవాంఛిత కార్యకలాపాలు జరుగుతున్నాయని చాలాకాలంగా ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే..

ఈ నేపథ్యంలోనే..

ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఆబ్కారీ అధికారులు నగరంలోని పబ్బులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కెల్విన్‌ ముఠా పట్టుబడ్డ తర్వాత జరిగిన దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా మత్తుమందులు వాడుతున్న అనేక మందిని పిలిపించి విచారించారు. వారిలో చాలామంది తమకు పబ్బుల్లోనే మత్తుమందుల వాడకం అలవాటైందని చెబుతూ ప్రత్యేకంగా కొన్ని పబ్బుల పేర్లు చెప్పారు. ఇవే ఆరోపణలపై గతంలో కొన్ని పబ్బుల్ని మూసివేశారు.

నోటీసులు

నోటీసులు

ఆబ్కారీ అధికారుల వద్ద ఉన్న సమాచారం ప్రకారం మొత్తం 16 పబ్బుల్లో డ్రగ్స్ వాడుతున్నట్లు తేలింది. ఆ 16 పబ్బుల యాజమాన్యాలతోపాటు నగరంలోని బార్ల యాజమాన్యాలను కూడా సమావేశానికి పిలిచారు. శనివారం ఉదయం 11 గంటలకు ఆబ్కారీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.

వారిచ్చిన సమాచారంతోనే..

వారిచ్చిన సమాచారంతోనే..

అసాంఘిక కార్యకలాపాలు నిరోధించేందుకు సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆబ్కారీశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ వెల్లడించారు. ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులు కూడా పబ్బుల గురించి కొంత సమాచారం ఇచ్చిన క్రమంలో అధికారులు ఈసారి పబ్బులపై పట్టు బిగించనున్నట్లు తెలుస్తోంది. తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పబ్బులకు వచ్చేవారి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించనున్నారు.

నోటీసులందుకున్న పబ్బులు ఇవే..

నోటీసులందుకున్న పబ్బులు ఇవే..

డ్రగ్స్ కేసును విచారిస్తున్న సిట్ బృందం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేటషన్(జీహెచ్ఎంసీ) పరిధిలోని 17 పబ్బులకు నోటీసులు జారీ చేసింది. శనివారం విచారణకు అబ్కారీ శాఖ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో సిట్ పేర్కొంది. నోటీసులు అందుకున్న పబ్బుల్లో ప్లేబాయ్, బీఅండ్ సీ, ఎయిర్, రన్స్, స్టోన్ వాటర్స్, ఓవర్ ది మూన్, హార్ట్ కప్ కాఫీ, బీట్స్ పెర్ మినిట్, కిస్మత్ లు‌ఉన్నాయి.

English summary
Excise department issued notices to few pubs in Hyderabad in Drugs case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X