ఎంసెట్ 2: లీకు లీడర్ రాజగోపాల్‌కు ప్రింటింగ్‌ వివరాలు చెప్పిందెవరు?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ 2 పేపర్ లీకేజి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పేపర్ లీకేజీకి సంబంధించి ఇప్పటికే సీఐడీ అధికారులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. సీఐడీ ప్రాథమిక విచారణను మూడు అంశాలుగా విభజించి దర్యాప్తు చేస్తోంది.

పేపర్ తయారీ-ప్రింటింగ్, కోచింగ్ సెంటర్లు-పరీక్షకు హాజరైన విధానం, సెల్‌ఫోన్ కాల్స్-ఎంసెట్ ర్యాంకులుగా విభజించి విచారణ చేస్తున్నారు. పేపర్ లీకేజి కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న రాజగోపాల్ రెడ్డి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు సీఐడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే రాజగోపాల్ నుంచి కొంత మేరకు సమాచారాన్ని సీఐడీ అధికారులు తెలుసుకున్నారు. 2014లో వెలుగు చూసిన పీజీ మెడికల్ స్కాంలో లీకేజికి అనుసరించిన విధానాన్నే ఎంసెట్ 2 పేపర్ లీకేజిలోనూ రాజగోపాల్ పాటించాడని సీఐడీ అధికారులు పేర్కొన్నారు.

పీజీ మెడికల్ ప్రశ్నాపత్రం ఎలా లీక్ చేశాడంటే!

పీజీ మెడికల్ ప్రశ్నాపత్రం ఎలా లీక్ చేశాడంటే!

ముందుగా పీజీ మెడికల్‌ ప్రశ్నా పత్రాన్ని మణిపాల్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ సంస్థలో ముద్రిస్తున్నట్లు తెలుసుకున్నాడు. తన వద్ద డ్రైవర్‌గా పని చేసిన అమీర్‌ అహ్మద్‌ ద్వారా ప్రవీణ్‌ అనే వ్యక్తిని ప్రింటింగ్‌ ప్రెస్‌లో తాత్కాలిక ఉద్యోగిగా చేర్పించాడు. అతని ద్వారా పీజీ మెడికల్‌ ప్రశ్నా పత్రాన్ని దొంగిలించాడు.

పీజీ మెడికల్ ప్రశ్నాపత్రం ఎలా లీక్ చేశాడంటే!

పీజీ మెడికల్ ప్రశ్నాపత్రం ఎలా లీక్ చేశాడంటే!

ప్రింటింగ్ సమయంలో ప్రశ్నా పత్రం ఒక దానికి ఉద్దేశపూర్వకంగా ప్రవీణ్ కింద పడేశాడు. సీసీ కెమెరాలకు చిక్కకుండా దానిపై తొలుత చేతిలో ఉన్న టవల్‌ను పడేశాడు. టవల్‌ను తీసుకునే నెపంతో ప్రశ్న పత్రం కూడా పట్టుకొని నేరుగా టాయిలెట్లోకి వెళ్లాడు. అక్కడ ప్రశ్న పత్రాన్ని లో దుస్తుల్లో దాచుకుని అమీర్‌ అహ్మద్‌కు అందజేశాడు.

పీజీ మెడికల్ ప్రశ్నాపత్రం ఎలా లీక్ చేశాడంటే!

పీజీ మెడికల్ ప్రశ్నాపత్రం ఎలా లీక్ చేశాడంటే!

ఆ తర్వాత పేపర్ లీకేజి అవడం, రాజగోపాల్ కోట్లు గడించడం జరిగిపోయింది. సరిగ్గా ఇదే విధంగా ఎంసెట్ 2 పేపర్‌ను ఢిల్లీలోని ప్రింటింగ్‌ ప్రెస్‌లో ముద్రిస్తున్నారని తెలుసుకున్న రాజగోపాల్ తనకు అత్యంత నమ్మకస్తుడిగా ఉండే షేక్‌ నౌషద్‌ను అందులో ఉద్యోగిగా చేర్పించాడు. అతని ద్వారా ఎంసెట్‌-2 పేపరును లీకు చేశాడు.

పీజీ మెడికల్ ప్రశ్నాపత్రం ఎలా లీక్ చేశాడంటే!

పీజీ మెడికల్ ప్రశ్నాపత్రం ఎలా లీక్ చేశాడంటే!

ఎంసెట్‌ 2లో కూడా సరిగ్గా ఇదే విధంగా వ్యవహరించినట్లు సీఐడీ అధికారుల విచారణలో వెల్లడైంది. పరీక్షకు రెండు రోజుల ముందు ఐదు సిటీల్లో విద్యార్ధులకు శిక్షణ ఇచ్చారు. ఇందుకోసం 25 మంది విద్యార్ధులను బెంగుళూరుకు తీసుకెళ్లి ప్రిపేర్ చేయించారు. మొత్తం రెండు సెట్ల క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయని, 320 ప్రశ్నలను విద్యార్ధులకు ఇచ్చారు.

పీజీ మెడికల్ ప్రశ్నాపత్రం ఎలా లీక్ చేశాడంటే!

పీజీ మెడికల్ ప్రశ్నాపత్రం ఎలా లీక్ చేశాడంటే!

ఎంసెట్ పేపర్ లీకేజి ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి జరిగిందని సీఐడీ అధికారులు నిర్ధారించిన సంగతి తెలిసిందే. రాజగోపాల్‌కు ఈ ప్రింటింగ్‌కు ప్రెస్ వివరాలు చెప్పేది ఎవరు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సాధారణంగా పోటీ పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలు ఎక్కడ ప్రింట్ అవుతుందనే వివరాలు కేవలం అతి తక్కువ మంది అధికారులకు మాత్రమే తెలుస్తుంది.

పీజీ మెడికల్ ప్రశ్నాపత్రం ఎలా లీక్ చేశాడంటే!

పీజీ మెడికల్ ప్రశ్నాపత్రం ఎలా లీక్ చేశాడంటే!

దాంతో, ప్రింటింగ్‌ ఎక్కడ జరుగుతోందనే విషయం లీకేజీ గ్యాంగ్‌కు ఎవరు చెప్పారనే దానిపై సీఐడీ అధికారులు దృష్టి సారించారు. ఎంసెట్‌ 2 ప్రింటింగ్‌కు సంబంధించి జేఎన్‌టీయూహెచ్‌లోని అతి కొద్ది మంది అధికారులకు మాత్రమే వివరాలు తెలుస్తాయి. దాంతో, లీకేజీ స్కాంలో అధికారుల పాత్రపై సీఐడీ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Eamcet 2 paper leckage creates rucks in telugu states. cid officials focus on who informing by printing press secrets by rajagopal.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X