వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తూచ్.. తూచ్, కేసీఆర్ తొండాట ఆడుతున్నారు. ఈటల రాజేందర్

|
Google Oneindia TeluguNews

హుజురాబాద్ బై పోల్ వేళ మాటల మంటలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రధానంగా ఈటల రాజేందర్ వర్సెస్ హరీశ్ రావు మధ్య అటాక్- కౌంటర్ అటాక్ కొనసాగుతోంది. టీఆర్ఎస్ పార్టీపై ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్‌లో మీటింగులకు ఇతర నియోజకవర్గాల నుంచి ప్రజలను తీసుకొచ్చి.. అందరినీ అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలుస్తామనే నమ్మకం లేకే సీఎం కేసీఆర్ తొండాట ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.

 కుట్రలు, కుతంత్రాలు

కుట్రలు, కుతంత్రాలు

కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారని... తన టక్కుటమార విద్యలన్నింటినీ హుజూరాబాద్ లో ప్రదర్శిస్తున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. కేసీఆర్ గిమ్మిక్కులు చెల్లవని చెప్పేరోజు ఈ నెల 30వ తేదీ అని చెప్పారు. ఈటల రాజేందర్‌ను ఓడిస్తే మరో 20 ఏళ్లు తెలంగాణను బానిసత్వంలో ఉంచవచ్చనేది కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. తనను ఎదుర్కొనే దమ్ము లేకే... తనపై భూ ఆక్రమణ ఆరోపణలు చేశారని ఈటల రాజేందర్ ఫైరయ్యారు. ఒక్క ఎకరం ఆక్రమించుకున్నా ముక్కు నేలకు రాస్తానని తన భార్య సవాల్ చేస్తే ఇంతవరకు కేసీఆర్ నుంచి స్పందనే లేదని అన్నారు.

అబద్దాలే

అబద్దాలే

హరీశ్ రావు అన్నీ అబద్ధాలే చెపుతున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. ఒకప్పుడు హరీశ్ రావు పై ఎంతో గౌరవం ఉండేదని గుర్తుచేశారు. కానీ ఆయన మామకు పూర్తిగా బానిస అయి, ఇప్పడు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తాటాకు చప్పుళ్లకు లొంగే వ్యక్తిని తాను కాదని చెప్పారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని.. తాము హామీ ఇస్తున్నామని చెప్పారు. తనను గెలిపించి హూజూరాబాద్ లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఈటల రాజేందర్ కోరారు.

నామినేషన్ల పర్వం..

నామినేషన్ల పర్వం..

హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్టోబర్ 8వరకు నామినేషన్ దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13గా ప్రకటించారు. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల నిర్వహిస్తారు. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటిస్తారు.

ఇద్దరికీ ఇంపార్టెంటే..

ఇద్దరికీ ఇంపార్టెంటే..

హుజురాబాద్‌లో విజయం టీఆర్ఎస్- బీజేపీకి తప్పనిసరి. గెలుపు కోసం ఆ రెండు పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అధికార పార్టీకి విజయం కంపల్సరీ.. లేదంటే మొహం చూపించుకునే పరిస్థితి ఉండదు. ఇక బీజేపీ పరిస్థితి అయితే మరీ దారుణం.. పార్టీకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మాత్రం జీవన్మరణ సమస్యే.. ఎందుకంటే ఆయన ఓడిపోతే రాజకీయంగా కోలుకోలేని దెబ్బ.. ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరీ హుజురాబాద్ ప్రజలు ఏం తీర్పు చెప్పనున్నారో చూడాల్సిందే.

Recommended Video

పెరిగిన నిత్యవసర సరుకులపై కార్యాచరణ ప్రకటించిన టీపిసిసి మహిళా నేత సునిత రావు
దళితబంధు

దళితబంధు


హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ.

English summary
bjp leader etela rajender slams cm kcr. he played a game rajender alleges. harish rao also cheater
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X