వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కేసులో మరో కీలక మలుపు: సీబీఐ కేసు నుంచి ఐఏఎస్ అధికారికి ఊరట!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు సంబంధించిన కేసులో 12వ నిందితుడిగా ఉన్న ఐఏఎస్ అధికారి, నాటి ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) డీ మురళీధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది.

జగన్! గుర్తుంచుకో, నిద్రలేకుండా చేస్తాం, ఢిల్లీలో టీడీపీ పట్ల అలాగేనా: జనసేన వార్నింగ్జగన్! గుర్తుంచుకో, నిద్రలేకుండా చేస్తాం, ఢిల్లీలో టీడీపీ పట్ల అలాగేనా: జనసేన వార్నింగ్

మురళీధర్ రెడ్డిపై సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణ ప్రక్రియను నిలిపివేస్తూ ఉమ్మడి హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

కేసు కొట్టివేయాలని మురళీధర్ రెడ్డి

కేసు కొట్టివేయాలని మురళీధర్ రెడ్డి

ఈ అంశంలో తనపై రిజిస్టర్ అయిన కేసును కొట్టివేయాలని కోరుతూ మురళీధర్ రెడ్డి హైకోర్టును గతంలో ఆశ్రయించారు. విచారణలో భాగంగా జస్టిస్ షమీమ్ అక్తర్ సోమవారం ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

పలువురు అధికారులకు ఊరట

పలువురు అధికారులకు ఊరట

జగన్ అక్రమాస్తుల కేసుల్లో పలువురు ఐఏఎస్ అధికారులపై ఉన్న కేసులను కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మర అధికారి మురళీధర్ రెడ్డికి ఊరట లభించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది.

లేపాక్షి హబ్ కేసు

లేపాక్షి హబ్ కేసు

అనంతపురం జిల్లా లేపాక్షి హబ్‌లో ఇందూ గ్రూప్‌కు భూకేటాయింపుల్లో క్విడ్ ప్రోకో ఉందని సీబీఐ కేసు నమోదు చేసింది. ఇందులో మురళీధర్ రెడ్డి 12వ నిందితుడిగా ఉన్నారు. ఈ చర్యను సవాల్ చేస్తూ మురళీధర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

Recommended Video

చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ఫలించలేదు...!
ఎక్కడ లాభం చేకూరిందో నిరూపించడంలో విఫలం

ఎక్కడ లాభం చేకూరిందో నిరూపించడంలో విఫలం

కేసు విచారించిన హైకోర్టు ఆయన విచారణను తాజాగా నిలిపివేసింది. ఈ వ్యవహారంలో ఎక్కడ లాభం చేకూరిందో నిరూపించడంలో సీబీఐ విఫలమైందని చెబుతూ విచారణ ఆపేసింది. మురళీధర్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

English summary
In a relief to IAS officer Muralidhar Reddy, an accused in Jagan’s illegal assets case, the Hyderabad High Court stayed the proceedings pending against him before the CBI court in connection with the Lepakshi Knowledge Hub case. He was accused number 12 in the case. Justice Shameem Akther was passing the interim order in a petition filed by Muralidhar Reddy seeking to quash the case registered against him by the CBI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X