వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీలకు నేతల వారసుల టెన్షన్.. తెలంగాణలో టిక్కెట్ల కోసం హైకమాండ్లపై ఒత్తిళ్లు

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో 15 నెలల సమయం మాత్రమే గడువు ఉంది. ఒకవేళ ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించినా, అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ముందస్తు ప్రజాతీర్పు కోరినా ఈ ఏడాది చివరిలోపు గానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ దఫా తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు అధికార టీఆర్ఎస్‌తోపాటు అన్ని రాజకీయ పార్టీలకు సవాల్ వంటివే. అదే పార్టీల్లోని నేతలు, వారి వారసులు తమ పార్టీ అధినాయకత్వానికి అతిపెద్ద సవాల్‌గా పరిణమించిందన్న అభిప్రాయ పడుతోంది.
వివిధ పార్టీల్లో సీనియర్ నేతలుగా ఉండటంతో వారంతా ఏ రకంగానైనా సరే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తమతోపాటు తమ వారసులకు టిక్కెట్లు కేటాయించాలని తమ అధిష్ఠాన వర్గాలను కోరుతున్నారు. అవసరాన్ని బట్టి అధి నాయకత్వాలను డిమాండ్ చేస్తున్నారు.

వేములవాడ నుంచి పోటీకి టీ న్యూస్ ఎండీ సంతోశ్ కుమార్?

వేములవాడ నుంచి పోటీకి టీ న్యూస్ ఎండీ సంతోశ్ కుమార్?

అధికార టీఆర్ఎస్ పార్టీలో నేతల కుటుంబాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ అధి నాయకత్వానికి చెందిన సీఎం కేసీఆర్‌తోపాటు ఆయన కుమారుడు, రాష్ట్ర మంత్రి తారక రామారావు, మరో మంత్రి - మేనల్లుడు తన్నీరు హరీశ్ రావు, కూతురు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా టీ - న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), అధికార టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఆయన సీఎం కేసీఆర్‌కు కొడుకు వరుస అవుతారు.

రమేశ్ బాబు విదేశీయుడని హోంశాఖ నిర్ధారణ

రమేశ్ బాబు విదేశీయుడని హోంశాఖ నిర్ధారణ

ప్రస్తుతం రాజన్న - సిరిసిల్ల జిల్లా పరిధిలో ఉన్న వేములవాడ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న చెన్నమనేని రమేశ్ బాబుపై పౌరసత్వం కేసు నడుస్తోంది. ఆయనపై ఉన్న అనర్హత నిజమేనని కేంద్ర హోంశాఖ తేల్చేసింది. ఈ క్రమంలో మరో ఏడాది కాలం ఎమ్మెల్యేగా కొనసాగేందుకా అన్నట్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ స్థానం నుంచి చెన్నమనేని రమేశ్ బాబుకు టిక్కెట్ కేటాయించే విషయం అనుమానమే మరి.

కూతురు కవిత కోసం టీఆర్ఎస్‌లోకి రెడ్యా ఫిరాయింపు ఇలా

కూతురు కవిత కోసం టీఆర్ఎస్‌లోకి రెడ్యా ఫిరాయింపు ఇలా

ఇక మహబూబాబాద్ జిల్లా పరిధిలోని మాజీ మంత్రి డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైనా టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించారు. 2004 ఎన్నికలు మినహా 1989 ఎన్నికల నుంచి వరుసగా గెలుపొందుతున్న రెడ్యానాయక్.. తన కూతురు - మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే మాళోత్ కవిత రాజకీయ వారసత్వం కోసమే అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారని విమర్శలు ఉన్నాయి. తనతోపాటు తన కూతురుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ నాయకత్వాన్ని రెడ్యా నాయక్ కోరుతున్నారు.

భూపాలపల్లిలో కూతురుకు టిక్కెట్ కోసం కొండా దంపతుల యత్నం

భూపాలపల్లిలో కూతురుకు టిక్కెట్ కోసం కొండా దంపతుల యత్నం

ఇక వరంగల్ జిల్లాలోనే ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన మాజీ మంత్రి - వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీ ఎమ్మెల్సీగా కీలక పాత్ర పోషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 1999 ఎన్నికల్లో తొలిసారి శాయంపేట అసెంబ్లీ స్థానం నుంచి కొండా సురేఖ విజయం సాధించారు. 2004లో శాయంపేట నుంచి 2009లో పరకాల నుంచి ఆమె విజయం సాధించారు. 2014 ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సురేఖ.. వరంగల్ ఈస్ట్ స్థానం నుంచి విజయం సాధించారు. తొలి నుంచి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొండా సురేఖ దంపతులతో వైరం ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఆయన సోదరుడు ప్రదీప్ రావు వరంగల్ ఈస్ట్ స్థానం నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు. తాజాగా కొండా సురేఖ దంపతులు భూపాలపల్లి అసెంబ్లీ స్థానం నుంచి తమ కూతురు సుష్మితకు టిక్కెట్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డిపై ఘన విజయం సాధించారు. అయితే టీడీపీ - బీజేపీ మధ్య పొత్తులో ఈ సీటు నుంచి బీజేపీ పోటీ చేసింది.

టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పలువురు నేతలు

టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పలువురు నేతలు

కానీ టీడీపీ నేతగా గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో కీలక పాత్ర పోషించారు. అయితే ఇటీవలి వరకు టీడీపీ తెలంగాణ పార్టీలో ముఖ్య భూమిక పోషించిన రేవంత్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ - టీఆర్ఎస్ మధ్య పొత్తు ఉంటుందన్న పార్టీ అధినేత చంద్రబాబు సంకేతాల మద్య కాంగ్రెస్ పార్టీ గూటికి చేరిపోయారు. ఆయనతోపాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు దాదాపు 15 మంది నేతలు ‘హస్తం' పార్టీ గూటికి చేరారు.

భూపాలపల్లిలో టీఆర్ఎస్ పార్టీలోనే త్రిముఖ పోరు

భూపాలపల్లిలో టీఆర్ఎస్ పార్టీలోనే త్రిముఖ పోరు

కానీ భూపాలపల్లి, భువనగిరి, నల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే నేతలు ఉండటంతో కంచర్ల భూపాల్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి తప్పనిసరి పరిస్థితుల్లో తమ రాజకీయ మనుగడ కోసం అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పటికే స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి ఉండగానే టీఆర్ఎస్ నాయకత్వం ఎంతో ముందుచూపుతో టీడీపీలో ఉన్న గండ్ర సత్యనారాయణ రావును ‘కారె'క్కించుకున్నది. ఇలా గండ్ర సత్యనారాయణరావుతోపాటు కొండా దంపతుల కూతురు సుష్మిత కూడా భూపాలపల్లిలో పోటీ పడుతున్నారు. దీని ప్రకారం అధికార టీఆర్ఎస్ పార్టీలోనే త్రిముఖ పోటీ ఉన్నదన్న విమర్శలు ఉన్నాయి.

తనయుడికి టిక్కెట్ కోసం ఎంపీ కేకే ప్రయత్నాలు

తనయుడికి టిక్కెట్ కోసం ఎంపీ కేకే ప్రయత్నాలు

హైదరాబాద్ నగరం గోషామహాల్ మాజీ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ 1989, 2004 మహరాజ్ గంజ్, 2009లో గోషామహల్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించారు. వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో మంత్రిగా సేవలందించిన ముఖేశ్ గౌడ్.. తాజాగా మారిన పరిస్థితుల్లో అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. ‘షరతులు వర్తిస్తాయి' అన్నట్లు తన కొడుకు విక్రం గౌడ్‌కు కూడా టిక్కెట్ కేటాయిస్తే ‘గులాబీ' కారెక్కే సంగతి ఆలోచన చేస్తానని తెగేసి చెప్పినట్లు సమాచారం. ఈ వార్త బయటకు పొక్కడంతో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ప్రకటన చేసి ముఖేశ్ గౌడ్ తాత్కాలిక ముగింపునిచ్చారు. ముఖేశ్ గౌడ్ మాజీ మిత్రుడు, ప్రస్తుతం టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు కూడా తన కొడుక్కి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం భారీగా ఆశలు పెట్టుకున్నారు.

కొడుకులు, కూతుళ్ల కోసం డీకే అరుణ, మర్రి ఇలా

కొడుకులు, కూతుళ్ల కోసం డీకే అరుణ, మర్రి ఇలా

కాంగ్రెస్ నేత ముఖేశ్ గౌడ్, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావుల మాదిరిగానే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌లోనూ సీనియర్ నేతలు తమ కూతుళ్లు, కొడుకులకు టిక్కెట్ల కోసం అధి నాయకత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో విపక్ష నేత కుందూరు జానారెడ్డి, మాజీ మంత్రులు డీకే అరుణ, దామోదర్ రాజనర్సింహ, జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు భిక్షపతి యాదవ్, మర్రి శశిధర్ రెడ్డి కూడా తమ కొడుకులు, కూతుళ్ల రాజకీయ ప్రవేశం కోసం ఆశలు పెట్టుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఇటీవలి కాలంలో కుటుంబంలో ఒక్కరికి మాత్రమే టిక్కెట్ కేటాయిస్తామని చెబుతున్నది. కానీ ప్రధాన నాయకత్వం మాత్రం తమ వారసులను ప్రోత్సహిస్తుండటంతో నేతలు, నేతల కుటుంబాల్లో ఆశల ఊసులు హోరెత్తుతున్నాయి.

మాజీ పీసీసీ సోదరులే మల్లు భట్టి విక్రమార్క, రవి

మాజీ పీసీసీ సోదరులే మల్లు భట్టి విక్రమార్క, రవి

టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆయన సతీమణి పద్మావతి కోదాడ నుంచి గెలుపొందారు. ప్రస్తుత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క సోదరుడు మల్లు రవి మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే కూడా. ఉమ్మడి ఏపీలో పీసీసీ అధ్యక్షుడు మల్లు అనంతరాములుకు వారిద్దరూ సోదరులే.

English summary
The elections to the Telangana state assembly are due in another 15 months or could be held even earlier in case the Election Commission decides to advance them. All the political parties in the state are gearing up to face the challenge.But the biggest challenge for leaders of almost all the major parties is from their respective families.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X