వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'జీహెచ్ఎంసీ గల్లా పెట్టెలో కోట్లకు కోట్లు..'

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యుడి కష్టాలు ఎలా ఉన్నా.. సర్కార్ గల్లా పెట్టే మాత్రం కళకళలాడుతోంది. పాత నోట్లతో పన్నులు చెల్లించే వెసులుబాటు కల్పించడంతో.. మొండి బకాయిలు సైతం ఊడిపడుతున్నాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీలోని పలు విభాగాలకు దాదాపు రూ.389కోట్ల డబ్బు పన్నులు, బకాయిలు, జరిమానాల రూపేనా వచ్చి చేరింది.

ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందన మేరకు గడువును సైతం పొడిగించింది ప్రభుత్వం. ఈ నెల 24వరకు బకాయిలు, ఛార్జీలు, జరిమానాలు చెల్లించే అవకాశం కల్పించింది. గడువును పొడగించడంతో.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ కు మరింత భారీగా ఆదాయం సమకూరే అవకాశముంది. మరోవైపు డిస్కం, జలమండలిలకు కూడా భారీ బకాయిలు వసూలవుతున్నాయి. వీటితో పాటు ట్రాఫిక్ ఈ-చలానా చెల్లింపులు కూడా భారీగానే జరుగుతున్నాయి.

జీహెచ్ఎంసీ ఖాతాలో రూ.157కోట్లు

గడిచిన నాలుగు రోజుల్లో జీహెచ్ఎంసీకి రూ.157కోట్ల భారీ ఆదాయం సమకూరింది. ఆస్తి పన్ను, ఎల్ఆర్ఎస్( లే అవుట్స్ క్రమబద్దీకరణ) ఛార్జీల రూపేనా రికార్డు స్థాయి ఆదాయం వచ్చి చేరింది. సోమవారం ఒక్కరోజే రూ.55కోట్లు జీహెచ్ఎంసీ ఖాతాలో చేరగా.. ఇందులో రూ.36కోట్లు లే అవుట్ల క్రమబద్దీకరణ వల్లే రావడం గమనార్హం. మరో రూ.19కోట్లు ఆస్తి పన్ను కింద జమయ్యాయి.

Ghmc fetches whopping income with banned notes

విద్యుత్ శాఖకు కూడా భారీగా చెల్లింపులు

పాత నోట్లతో చెల్లింపులు వెసులుబాటు కల్పించడం విద్యుత్ శాఖకు కూడా కలిసొచ్చింది. గత నాలుగు రోజుల్లో రూ.202కోట్లు బిల్లుల రూపంలో విద్యుత్ శాఖకు సమకూరాయి. సెలవు దినం నాడు కూడా విద్యుత్ శాఖ కౌంటర్లు పనిచేయడంతో.. సుమారు రూ.20కోట్ల వరకు ఛార్జీలు వసూలయ్యాయి. కొంతమంది వినియోగదారులు ముందస్తు చెల్లింపులు కూడా చేస్తుండడంతో విద్యుత్ శాఖకు భారీ ఆదాయం వచ్చి చేరుతోంది.

మొండి బకాయిలు సైతం ఊడిపడుతున్నాయి

జలమండలిలో మొండి బకాయిలు సైతం వసూలవుతున్నాయి. గత నాలుగు రోజుల్లో సుమారు రూ.30కోట్ల ఆదాయం జలమండలి ఖాతాలో చేరింది. సోమవారం ఒక్కరోజే రూ.4.44కోట్ల చార్జీలు వసూలయ్యాయి.

ట్రాఫిక్ ఈ-చలానా చెల్లింపులు

పెండింగ్ ఈ-చలాన్ల చెల్లింపులను పాత నోట్లతో చెల్లించేస్తున్నారు వాహనదారులు. దీంతో సోమవారం ఒక్కరోజే సుమారు రూ.13లక్షల దాకా ఆదాయం ట్రాఫిక్ పోలీస్ విభాగానికి వచ్చి చేరింది.

English summary
Cancellation of old currency notes of Rs 500 and Rs 1000 denomination by Prime Minister Narendra Modi has fetched huge income to the GHMC in the form of taxes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X