జీహెచ్ఎంసీ మరో వినూత్న కార్యక్రమం.!20కోట్లతో మోడల్ ఫిష్ మార్కెట్ల నిర్మాణం.!
హైదరాబాద్ : నగర ప్రజల కోసం జీహెచ్ఎంసీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తాజా కూరగాయలను కోరుకుంటున్నట్టే తాజా మాంసాహారాలను మాంస ప్రియులు కోరుకోవడం సహజం కాబట్టి అలాంటి ప్రజానికానికి తాజా చేపలను అందించేందుకు బృహత్కర కార్యక్రమానికి నగరపాలక సంస్థ సన్నాహాలు చేసనట్టు తెలుస్తోంది. నగర ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నగరంలో అనేక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా కనీస అవసరాలైన నిత్యావసర సరుకులతోపాటు స్వచ్ఛమైన నాణ్యమైన కూరగాయలు, మాంసాహారం, చేపలు ఒకే చోట దొరికే విధంగా అన్ని వసతులతో కూడిన మోడల్ మార్కెట్ల నిర్మాణాలు చేపట్టి ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు జిహెచ్ఎంసి విశిష్టంగా కృషి చేస్తున్నట్టు నగర పాలక సంస్ధ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

నిత్యావసర సరుకులతో పాటు కూరగాయలు, మాంసాహారాలు నగరంలో రోడ్ల పై అమ్మడం వలన ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఎదురౌతుందని నగరపాలక సంస్ధ భావిస్తోంది. దీంతో రవాణా వ్యవస్థకు తీవ్రంగా ఆటంకం కలుగుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని నగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్దేశిత ప్రదేశాలను గుర్తించి మోడల్ మార్కెట్ల నిర్మాణాలను చేపట్టింది నగర పాలక సంస్థ. అందులో భాగంగా జిహెచ్ఎంసి అధ్వర్యంలో 19.40 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 5 ఫిష్ మార్కెట్లను చేపట్టింది. అందులో నాచారం, కూకట్ పల్లి మార్కెట్ లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. మల్లాపూర్, బేగంబజార్ రెండు పనులు తుది దశలో ఉన్నట్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు ఈ మార్కెట్ ప్రదేశాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కూడా చేపట్టారు. నారాయణగూడలో పాత మునిసిపాలిటీ కూరగాయల మార్కెట్ ను 4కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మోడల్ మార్కెట్ నిర్మాణం చేపట్టగా ఆ నిర్మాణం దాదాపు తుది దశలో ఉన్నట్టు అధికారులు నిర్ధిరిస్తున్నారు. త్వరలో ఆ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందబాటులోకి తేనున్నట్లు తెలిపారు.
Recommended Video













Click it and Unblock the Notifications