ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మింగింది: కొండచిలువ పొట్టలోంచి గొర్రె పిల్లను తీశాడు

కొండచిలువ మింగేసిన గొర్రెపిల్ల.. క్షేమంగా బయటకు వచ్చిందా? ఇదెలా సాధ్యం..? అనుకుంటున్నారా...! సాధ్యమైంది.

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

ఖమ్మం: కొండచిలువ మింగేసిన గొర్రెపిల్ల.. క్షేమంగా బయటకు వచ్చిందా? ఇదెలా సాధ్యం..? అనుకుంటున్నారా...! సాధ్యమైంది. ఎలానో తెలుసుకోవాలనుకుంటే ఇది చదవండి...

ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి గ్రామ శివారు ప్రదేశం. శనివారం మధ్యాహ్నం. అక్కడ మేక మంద మేత మేస్తోంది. కొంచెం దూరంలో కాపరి బొడ్డు క్రిష్ణ నిలుచుని చూస్తున్నాడు. అక్కడక్కడ ఇంకొంతమంది కాపరులు ఉన్నారు. ఆ మేకలు బాగా ఆకలితో ఉన్నట్టున్నాయి. చుట్టూ పరిసరాలను గమనించకుండా ఆవురావురుమంటూ తింటున్నాయి.

 A goat kid in the stomach of Python...

ఇంతలో, ఆ మేకల మందలో కలకలం. ఎక్కడి నుంచి వచ్చిందో.. దాదాపుగా 20 అడుగుల పొడవున్న కొండచిలువ! ఆ మేకల మందలోకి దూసుకొచ్చింది. ఓ మేక పిల్లను అమాంతం నోట కరుచుకుని మింగేసింది. కదల్లేక అక్కడే ఉంది. గగొర్పిడిచే ఆ ద్రుశ్యాన్ని ఆ మేకల కాపరి క్రిష్ణ చూశాడు. వెనుకడుగు వేయలేదు.

వేగంగా కదిలాడు. జంకూగొంకూ లేకుండా ముందుకు ఉరికాడు. తన చేతిలోని గొడ్డలితో ఆ కొండచిలువపై శక్తికొద్దీ గట్టిగా ఒక్క వేటు వేశాడు. అంతే.. అది చచ్చిపోయింది. దాని పొట్టను చీల్చాడు. మేక పిల్లను బయటకు తీశాడు. ఆశ్చర్యం..! అది బతికే ఉంది..!!

శభాష్ క్రిష్ణా...!

''క్రిష్ణా..! ఆనాడు ఆ క్రుష్ణుడు.. రాక్షసిని చంపాడు, జనాలను రక్షించాడు. ఈనాడు ఈ క్రుష్ణుడు.. కొండచిలువను చంపాడు, మేకపిల్లను కాపాడాడు. పేరు నిలబెట్టుకున్నావ్ కిట్టయ్యా...!!'' అంటూ అతడిని తోటి కాపరులు, గ్రామస్తులు అభినందించారు.

English summary
A goat has came out safely from the stomach of python in Khammam district of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X