వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జోకులేశారు, ప్రపంచంలో నన్నే ఎక్కువ తిట్టారు: హైద్రాబాద్‌పై బాధపడ్డ కెసిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజకీయ నాయకులు కొందరు గ్రామాల్లో సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, వాటిని చూసి నిరుత్సాహ పడవద్దని, తాను 2001లో తెలంగాణ కోసం ఉద్యమించినప్పుడు తన పైన జోకులు వేశారని, ప్రపంచంలో తనను తిట్టినట్లుగా ఎవరినీ తిట్టలేదేమోనని సిఎం కెసిఆర్ మంగళవారం అన్నారు.

ఆచార్య జయశంకర్ వర్సిటీలో సిఎం అధ్యక్షతన గ్రామజ్యోతిపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో కెసిఆర్ మాట్లాడారు. గ్రామాల్లో రాజకీయ నాయకులు సృష్టించే సమస్యలను చూసి నిరుత్సాహపడవద్దని, గోడకు కొట్టిన బంతిలా దూసుకెళ్లాలన్నారు.

నాపై జోకులేశారు, తిట్టారు

2001లో తాను తెలంగాణ కోసం ఉద్యమం ప్రారంభించినప్పుడు తన పైన జోకులు వేశారని, ఎందరో తిట్టారన్నారు. ప్రపంచంలో తనను తిట్టినట్లు ఎవరినీ తిట్టలేదన్నారు. కానీ, తెలంగాణ ఉద్యమానికి భారత రాజకీయ వ్యవస్థ దిగివచ్చి రాష్ట్రం ఇచ్చిందన్నారు.

గ్రామజ్యోతి అద్భుతమైన కార్యక్రమం అన్నారు. గ్రామజ్యోతిలో భాగంగా అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టే చేస్తే తెలంగాణ అద్భుతంగా తయారవుతుందన్నారు. గ్రామాల్లో ఉన్న 750 మందికి ఒక చెత్త రిక్షా పంపిణీ చేస్తామన్నారు. ప్రతీ గ్రామానికి ఒక డంప్‌యార్డ్, శ్మశానవాటిక ఏర్పాటు చేస్తామన్నారు.

డంప్ యార్డుల కోసం రూ.20 కోట్ల నుంచి రూ.20 నిధులతో ట్రైసైకిళ్లు పంపిణీ చేస్తామని, రాష్ట్రంలో అన్ని గ్రామాలకు 25,000 రిక్షాలు ఇస్తామన్నారు. గ్రామాల్లో ఒక రోజు పవర్ హాలిడే ప్రకటించాలన్నారు. గ్రామజ్యోతిలో పంచాయతీరాజ్ వ్యవస్థ మొత్తం పాల్గొనాలన్నారు.

గ్రామసభలో గ్రామస్తులే గ్రామ ప్రాధాన్యతను గుర్తించాలన్నారు. మనకు శక్తివంతమైన మహిళా సంఘాలున్నాయని, అందరి సమిష్టి కృషితో తెలంగాణను అద్భుతంగా తయారు చేయవచ్చన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా చెత్తా చేదారమే కనిపిస్తోందన్నారు. అలా ఉండకూడదన్నారు.

గ్రామజ్యోతి పథకంతో తెలంగాణ గ్రామాలు వెలిగిపోవాలన్నారు. సర్పంచ్, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధికై ప్లానింగ్ జరగాలన్నారు. ప్లానింగ్‌లో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు అవుతున్నా అనుకున్న మేర గ్రామాలు అభివృద్ధి చెందలేదన్నారు.

గ్రామీణాభివృద్ధి కుంటుపడిందన్నారు. ఊర్లళ్లో చెత్త లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదేనని చెప్పారు. సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమం చేపట్టానని తెలిపారు. దళితులు ఉన్నతంగా ఎదగాలని చెప్పారు.

 Grama Jyothi awareness programme

చిన్న ముల్కనూర్‌ను దత్తత తీసుకున్నా

తాను హుస్నాబాద్ మండలంలోని చిన్న ముల్కనూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నానని, ప్రజాప్రతినిధులు అందరూ మండలానికి ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలన్నారు. అందరం కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామంటే చిన్నముల్కనూరు గ్రామస్తులు అద్భుతంగా స్పందించారని చెప్పారు.

అంకాపూర్, గంగాదేవిపల్లి, ముల్కనూరు గ్రామాలను ఇతర గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రైతాంగం యొక్క సంఘటిత శక్తికి అంకాపూర్ గొప్ప ఉదాహరణ అన్నారు. ఆ గ్రామస్తులతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నానని చెప్పారు.

గంగదేవిపల్లిలో 25 రకాల కమిటీలు ఏర్పాటు చేసుకున్నారని, వారు 25 రకాల పనులు చేస్తుంటారన్నారు.
ఆ విధంగా ప్రతీ గ్రామంలోని వారు ముందుకు పోయినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. చెడుకు వ్యాప్తి ఎక్కువ మంచికి అంత త్వరగా గుర్తింపు రాదన్నారు.

గ్రామాల్లో సమస్యలపై యుద్ధం ప్రకటించాలన్నారు. గ్రామాల నుంచి పేదరికాన్ని తరిమికొట్టాలన్నారు. దేవుడి పుణ్యాన వానలు పడితే హరితహారం విజయవంతమవుతుందన్నారు. మనషుల సంఘటిత శక్తిలోని బలాన్ని మించింది ఏదీ లేదన్నారు.

ప్లానింగ్ అవర్ విలేజ్ అన్న స్పృహ పంచాయతీలకు లేదని, ప్రజలకూ లేదన్నారు. గ్రామీణాభివృద్ధి కుంటుపడిపోయందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని ప్రజలు కూర్చొని గ్రామ సభను నిర్వహించుకోవాలన్నారు. గ్రామాల్లో ఫ్రణాళికా బద్ధంగా అభివృద్ధి పనులు జరగడం లేదన్నారు.

అందరం కలిసి గ్రామాలను అభివృద్ధి చేసుకుందామన్నారు. గ్రామాలు బాగుపడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతి గ్రామంలో డంప్ యార్డ్ ఉండాలన్నారు. జనాభా ఆధారంగా నిధులు విడుదల చేస్తామని చెప్పారు. నేను కూడా అన్ని జిల్లాల్లో తిరుగుతానని చెప్పారు.

కార్మికుల జీతాల పెంపుపై...

కార్మికులకు జీతాలు పెంచుతామని చెప్పినా సమ్మెను చేశారని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఉద్దేశ్యపూర్వకంగా రెచ్చగొట్టి సమ్మెలు చేయిస్తున్నారన్నారు. అతీత శక్తులను పట్టించుకోకుండా ముందుకు పోవాలన్నారు. తెలంగాణకు హైదరాబాద్ పెద్ద అడ్వాంటేజ్ అన్నారు. హైదరాబాద్‌కు పక్కక రాష్ట్రాల నుంచి కూరగాయలు రావడం బాధాకమని చెప్పారు. మన వద్దే ఎన్నో కూరగాయలు పండించుకోవచ్చని చెప్పారు.

English summary
Grama Jyothi awareness programme in prof jayashankar agriculture university.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X