ప్రియుడు చేసిన ఘోరం: వైద్యురాలి నిర్వాకం, ఆమె ప్రాణాలు బలి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: హైదరాబాదులోని వనస్థలిపురంలో అబార్షన్‌ చేసి గర్భవతి మృతికి కారణమైన కేసులో డాక్టర్‌తో పాటు ప్రియుడు, అతడికి సహకరించిన మహిళను పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఇంజనీరింగ్ విద్యార్థిని హారికకు అబార్షన్ చేసిన వైద్యురాలు డాక్టర్ అంబుల గిరిజా రాణిని పోలీసులు అరెస్టు చేశారు

హారిక ప్రియుడు సారంగి మధును, ఓ మహిళ కామావతి శిరీషను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అబార్షన్ కోసం వైద్యురాలికి, ప్రేమ జంటకు మధ్య వ్యవహారం నడిపిన మహిళగా శిరీషను పోలీసులు గుర్తించారు.

ఐదు నెలల గర్భాన్ని తొలగించేందుకు వనస్థలిపురం కమలానగర్‌లోగల ఓ ఆస్పత్రి వైద్యురాలు గిరిజారాణిని శనివారం కలిశాడు. రూ. 20 వేలు తీసుకుని అదేరోజు సాయంత్రం హారికకు వనస్థలిపురంలోని అనూష మెటర్నిటీ అండ్ నర్సింగ్ హోంలో అబార్షన్‌ చేశారు. అబార్షన్ వికటించి హారిక మరణించింది

అబార్షన్‌తో మృతి..

అబార్షన్‌తో మృతి..

సంగారెడ్డి జిల్లా అమీన్‌పుర మండలం, చీరంగూడ గ్రామానికి చెందిన మల్లూరి మహేష్‌ కుమార్తె హారిక(19) బీటెక్‌ చదువుతోంది. గర్భవతి అయిన ఆమెకు బంధువు సారంగి మధు వనస్థలిపురం, కమలానగర్‌ కాలనీలోగల ఓ ఆస్పత్రిలో అబార్షన్‌ చేయించగా ఆమె మరణించింది.

వారిద్దరి మధ్య ఇలా....

వారిద్దరి మధ్య ఇలా....

మధు సైదాబాద్‌లో ఉంటూ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. హారికకు అతడు మూడేళ్ల క్రితం పరిచయమయ్యాడు. వారి పరిచయం ప్రేమగా మారి శారీరక సంబంధానికి దారి తీసింది. దీంతో ఆమె గర్భవతి అయింది. దాంతో అబార్షన్‌కు ఏర్పాట్లు చేసుకున్నారు. వైద్యురాలితో సంప్రదింపులు జరిపి అబార్షన్‌కు ఏర్పాటు చేసిన శిరీష క్లాత్ స్టోర్‌లో పనిచేస్తుంది.

అస్పత్రికి తరలించే లోపలే...

అస్పత్రికి తరలించే లోపలే...

మధుకు సహాయంగా హైదరాబాదులోని అంబర్‌పేటకు చెందిన శిరీష ఉంది. హారికకు ఆదివారం ఉదయం బీపీ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో అంబులెన్స్‌లో ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించడంతో దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి డాక్టర్‌ గిరాజారాణి, మృతురాలి ప్రియుడు మధు, సహాయకురాలు శిరీషను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

మాత్ర ఇచ్చారు...

మాత్ర ఇచ్చారు...

ఆగస్టు 5వ తేదీన ఆస్పత్రిలో చేరినప్పుడు హారికకు ఓ మాత్ర ఇచ్చారు. దాంతో అబార్షన్ అయింది. ఆ తర్వాత విపరీతమైన రక్తస్రావం జరిగి, హారిక స్పృహ కోల్పోయింది. దాంతో మరో ఆస్పత్రికి ఆమెను తరలించాలని డాక్టర్ హారిక ప్రియుడు మధుకు సూచించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Vanasthalipuram police arrested Dr Ambula Girija Rani, who performed the abortion on engineering student M. Harika leading to her death, her boyfriend Sarangi Madhu and another woman, Kamavathi Sirisha, who mediated the deal between the couple and the hospital.
Please Wait while comments are loading...