వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కీలక మార్పులు, రేవంత్‌కు ఏ పదవిస్తారో తెలియదు: ఉత్తమ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో త్వరలోనే కీలకమైన మార్పులు చోటు చేసుకొనే అవకాశాలున్నాయనే అభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే రాహూల్ టీమ్‌లో ఎవరెవరు ఉంటారనే విషయమై స్పష్టత లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ జాతీయ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా తెలంగాణలో అవసరమైన అన్ని రకాల వ్యూహలను కాంగ్రెస్ పార్టీ అనుసరించాలని భావిస్తోంది.

అయితే రేవంత్ రెడ్డి నేతృత్వంలో టిడిపి నుండి కీలకమైన 16 మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పీసీసీని పునర్వవ్యవస్థీకరించే అవకాశం ఉందనే ప్రచారం కూడ పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

2017 రౌండప్: కాంగ్రెస్‌కు కలిసొచ్చింది, బాబుకు రేవంత్ దెబ్బ, టిఆర్ఎస్ చెక్ పెట్టే ప్లాన్ ఇదే2017 రౌండప్: కాంగ్రెస్‌కు కలిసొచ్చింది, బాబుకు రేవంత్ దెబ్బ, టిఆర్ఎస్ చెక్ పెట్టే ప్లాన్ ఇదే

కాంగ్రెస్ కార్యవర్గంలో మార్పులు

కాంగ్రెస్ కార్యవర్గంలో మార్పులు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మార్పులు చేర్పులు చోటు చేసుకొనే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రేవంత్ రెడ్డితో పాటు టిడిపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేతలకు కాంగ్రెస్ పార్టీలో ప్రాతినిథ్యం కల్పించేందుకు మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలకు ఈ సమాచారం జాతీయ నాయకత్వం నుండి ఉందని పీసీపీ చీఫ్ ఓ మీడియాకు చెప్పారు. అయితే ఎప్పటిలోపుగా ఈ మార్పులు ఉంటాయనేది మాత్రం స్పష్టత లేదు

రేవంత్ కు ఏ పదవి ఇస్తారో తెలియదు

రేవంత్ కు ఏ పదవి ఇస్తారో తెలియదు

రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి ఇస్తారో మాత్రం తెలియదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వమే రేవంత్ రెడ్డికి పదవిని కట్టబెట్టే విషయంలో నిర్ణయం తీసుకొంటారని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు.

రాహుల్ టీమ్‌లో ఎవరుంటారు

రాహుల్ టీమ్‌లో ఎవరుంటారు

తెలంగాణ రాష్ట్రం నుండి రాహుల్ టీమ్ లో ఎవరుంటారనే విషయమై స్పష్టత లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. రాహుల్ గాంధీ ఎఐసిసి అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆయన టీమ్‌లో రేవంత్ రెడ్డి ఉంటారా అనేది కూడ ప్రస్తుతం చర్చ సాగుతోంది. అయితే రేవంత్ రెడ్డిని రాహుల్ టీమ్‌లోకి తీసుకొంటే రాజకీయంగా ఇబ్బందులు వచ్చే అవకాశం లేకపోలేదనే వారు కూడ లేకపోలేదు.రాహుల్ టీమ్ పై రకరకాలుగా ఉహగానాలు వస్తున్నాయి. త్వరలోనే ఈ ఉహగాహనాలకు తెరపడే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

కొడంగల్ లో రేవంత్ విజయం తథ్యం

కొడంగల్ లో రేవంత్ విజయం తథ్యం

బి ఫాం అందించిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకే రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖను ఇచ్చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు.. అయితే మరోసారి రేవంత్ రెడ్డి రాజీనామా లేఖను స్పీకర్ కు ఇచ్చే విషయమై పార్టీలో చర్చించలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ మీడియాకు చెప్పారు.కొడంగల్ లో ఎన్నికలు వస్తే రేవంత్ రెడ్డి విజయం సాధించడం తథ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రి కెటిఆర్ బంధువులపై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి టిఆర్ఎస్ నేతలను డిమాండ్ చేశారు.

English summary
I don't know which post will to give Revanth reddy said pcc chief Uttam kumar reddy. he spoke to media on Tuesday a news channel at hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X