నారాయణ కాలేజీలో ఘోరం: తండ్రి ఫీజు కడుతుండగానే కూతురు ఆత్మహత్య

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నగరంలోని బండ్లగుడలోని నారాయణ కళాశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. కింది అంతస్తులోని కళాశాల ఆఫీసులో తండ్రి ఫీజు చెల్లిస్తుండగా.. అదే భవనంలోని పైఅంతస్తులో కుమార్తె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ హృదయవిదారక ఘటన వివరాల్లోకి వెళ్తే... యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండకు చెందిన పబ్బు వెంకటేశం, దుర్గమ్మల రెండో కూతరు శ్రావ్య(16) నాగోల్‌ సమీపంలోని బండ్లగూడలో ఉన్న నారాయణ జూనియర్‌ కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆమె శనివారం వలిగొండకు వెళ్లింది.

Inter student hangs herself in hostel

బుధవారం తిరిగి శ్రావ్యను తండ్రి కళాశాలకు తీసుకురాగానే.. తన గదిలోకి వెళ్లిపోయింది. ఫీజుకట్టాల్సి ఉండటంతో తండ్రి కౌంటర్‌ వద్దకు వెళ్లాడు. సిబ్బంది లేకపోవడంతో సుమారు 40 నిమిషాలు వెంకటేశం అక్కడే ఉండిపోయాడు. ఇంతలో అంబులెన్సు కళాశాల బయటికి వచ్చి ఆగేసరికి అందరిలాగే వెంకటేశం కూడా ఏం జరిగిందనే ఆందోళనగా చూశాడు.

AP Minister Narayana Reacts On Pawan Kalyan Words - Oneindia Telugu

హాస్టల్ గదిలో ఉరివేసుకున్న ఓ అమ్మాయిని అంబులెన్సులోకి తీసుకెళ్తుండగా.. అక్కడికి వెళ్లి చూసి నిర్ఘాంతపోయాడు. తన కుమార్తె అని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఆసుపత్రికి తరలించే సరికే శ్రావ్య ప్రాణాలు కోల్పోయింది. కళాశాలలో ఒత్తిడి కారణంగానే తన కుమార్తె మృతి చెందినట్లు వెంకటేశ్‌ ఆరోపించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న హయత్‌నగర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An Intermediate student ended her life in a hostel room even while her father was waiting at the lounge in Hayathnagar on Wednesday, minutes after coming there on completion of holidays.
Please Wait while comments are loading...