కాలేజీ భవనం పైనుంచి దూకి.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
వరంగల్ హన్మకొండలోని ఏకశిల జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న కందగట్ల సింధుజ సోమవారం మధ్యాహ్నం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.
వరంగల్: ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వరంగల్ హన్మకొండలోని ఏకశిల జూనియర్ కళాశాలలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. కాలేజీ భవనంపైకి వెళ్లిన ఓ విద్యార్థిని అక్కడి నుంచి కిందకు దూకేసి ఆత్మహత్యాయత్నం చేసింది.

ఆ విద్యార్థిని ఇంటర్ సెకండియర్ చదువుతున్న కందగట్ల సింధుజగా తెలిసింది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను లెక్చరర్లు దగ్గరలోని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. ఆ విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సింధుజ ఆత్మహత్యాయత్నం చేయడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications