కేసీఆర్ నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయారు!అదిష్టానం ఆదేశాల మేరకే పాదయాత్రలన్న భట్టి!
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రజా సమస్యలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో శాసనసభ సమావేశాలను నెలరోజుల వరకూ నిర్వహించాలనే డిమాండ్ ను సభలో ఉంచుతానన్నరు భట్టి.
హైదరాబాద్ : శాసనసభ బడ్జెట్ సమావేశాలు కనీసం 30 నుంచి 35 రోజుల పాటు నిర్వహించాలని బిఏసి సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తానన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎజెండాగా తీసుకొని ప్రజల గొంతుక అసెంబ్లీలో గళం వినిపిస్తామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, వీటితో ముడిపడి ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరించాలని అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్నారు భట్టి విక్రమార్క.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీని ఎక్కువ రోజులు నడపాలి..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాల పూర్తవుతున్నా నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారని, ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి స్పష్టమైనటువంటి సమాధానం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబట్టడం కోసం తమ ప్రయత్నం కొనసాగిస్తామన్నారు భట్టి. వ్యవసాయానికి సంబంధించి విద్యుత్ కోతలు, రుణమాఫీ, పోడు భూముల సమస్యలు, ధరణి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇంటి స్థలాలు, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ, రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు, పెంచిన కరెంటు చార్జీల గురించి అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రజల గొంతుకగా మాట్లాడుతామన్నారు.

సంక్షేమ పధకాల అమలు నత్త నడక..
ఇరిగేషన్ ప్రాజెక్టులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులు, తదితర ప్రజల అంశాలపై శాసనసభలో లేవనెత్తి లోతుగా చర్చించడానికి ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామని,
ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేసుకొని సమస్యల ప్రాధాన్యతను ఎంపిక చేసుకొని వాటి గురించి శాసనసభలో సుదీర్ఘంగా లోతైన చర్చ పెడతామన్నారు భట్టి. ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తులు, పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో వచ్చిన వినతులు అన్నింటిని పరిష్కరించాలని అసెంబ్లీలో లేవనెత్తుతానన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 45 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు సరిగ్గా లేవన్నారు భట్టి.

రైతాంగానికి బడ్జెట్ లో ద్రోహం చేసారు..
2022-23 సంవత్సరంలో వ్యవసాయ రంగానికి బడ్జెట్లో 3.84 శాతం నిధులు కేటాయించగా ఈ సంవత్సరం 3.20 శాతానికి కుదించారని, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పిఎం కిసాన్ లాంటి పథకాలకు సైతం కోత పెట్టారని ఆవేదన వ్యక్తం చేసారు. దేశంలో చాలామంది ప్రజలు ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగానికి ఏటా నిధులు పెంచాల్సిన ప్రభుత్వం కోతలు విధిస్తూ వస్తున్నదని ఆరోపించారు. అంతే కాకుండా విద్య వైద్యం రంగాలకు సైతం బడ్జెట్లో కోత పెట్టిందని, నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడలేదని, ఉద్యోగాల గురించి వూసే లేదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని మండి పడ్డారు.

పాదయాత్ర గురించి అధిష్టానం నిర్ణయం..
హాత్ సే హాత్ జోడో యాత్ర గురించి ఈ నెల 4న తెలంగాణ ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందన్నారు భట్టి విక్రమార్క. కార్యాచరణ ప్రణాళికను పార్టీ ప్రకటిస్తుందని పేర్కొన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో పార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి పాల్గొనమంటే అక్కడ నుంచి పాల్గొంటానన్నారు. రాష్ట్రమంతా చేసే పాదయాత్ర గురించి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, పాదయాత్ర చేయమని అధిష్టానం ఆదేశిస్తే ఖచ్చితంగా రాష్ట్ర మొత్తం పాదయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications