వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెప్పకుండా వస్తా..! 'బీ అలర్ట్'.. : నేతలకు కేసీఆర్ హెచ్చరిక (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ప్రభుత్వ పథకాలు ఏవైనా సరే జనంలోకి చొచ్చుకు వెళ్లాలంటే.. ప్రజలను వాటితో మమేకం చేసే ప్రత్యేకత ఏదో దానితో ముడిపడి ఉండాలి. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. హరితాహారానికి సెంటిమెంట్ ను జోడిస్తూ.. ఆయన తలపెట్టిన 'రాశులకు అనుగుణంగా మొక్కలను నాటడం' ప్రజల్లోకి బలంగా వెళ్లగలిగింది.

మొత్తంగా.. హరితాహారాన్ని సైతం ఓ ఉద్యమం తరహాలో ఉధృతం చేస్తోన్న తెలంగాణ మంత్రి కేసీఆర్, పక్కా ప్రణాళికతో తెలంగాణను పచ్చని వనంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించే విషయమై కూడా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన అధికారులకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే క్యాంపు కార్యాలయంలో హరితహారంపై సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్. హరితహారానికి సంబంధించి అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ఓ టెస్ట్ కూడా పెడుతానన్నారు కేసీఆర్. అదేంటో తెలియాంటే స్లైడ్స్ ను ఫాలో అవండి..

చెప్పకుండా వస్తా..

చెప్పకుండా వస్తా..

ఆకస్మిక తనిఖీల ద్వారా ఆయా జిల్లాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారుల అప్రమత్తతను పరీక్షిస్తానన్నారు సీఎం కేసీఆర్. 'చెప్పకుండా వచ్చి తనఖీ చేస్తా.. అలర్ట్ గా ఉండడి' అన్న తరహాలో హెచ్చరికలు జారీ చేశారు కేసీఆర్.

పరీక్షలో నెగ్గితేనే..

పరీక్షలో నెగ్గితేనే..

హరితహారంలో ప్రజా ప్రతినిధులు చూపుతోన్న చొరవ ద్వారానే ఆయా నేతల పనితీరును అంచనా వేస్తామని, ఒకవిధంగా ఇది నేతల సామర్థ్యానికి పరీక్ష లాంటిదని వ్యాఖ్యానించారు కేసీఆర్. నేతల పనితీరుకు సంబంధించి తాను ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నానని అన్నారు.

టార్గెట్ 46 కోట్ల మొక్కలు

టార్గెట్ 46 కోట్ల మొక్కలు

సీజన్ ముగిసేనాటికి మొత్తం 46 కోట్ల మొక్కలు నాటడమే ధ్యేయంగా పనిచేయాలని సమీక్షా సమావేశంలో అధికారులకు, నేతలకు సూచించారు సీఎం కేసీఆర్. హరితహారమే నేతల పనితనానికి గీటురాయి అని గుర్తుంచుకోవాలన్నారు.

సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలి

సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలి

మొక్కలు నాటడమే కాదు.. వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలన్నారు సీఎం కేసీఆర్. సంరక్షణ కోసం రూ.1500 కోట్ల కాంపా నిధులు ఉన్నాయని ఈ సందర్బంగా గుర్తు చేశారు. సమీక్ష సమావేశంలో భాగంగా.. మంత్రి హరీశ్ రావు, సీఎస్ రాజీవ్‌ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఐఏఎస్ లు ఎస్ కే జోషి, రామకృష్ణారావు, నవీన మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.

English summary
Telangana CM KCR held a review meet on HARITHA HARAM at camp office. He warned party MLA's and Ministers that everybody should actively participate in HARITHA HARAM
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X