కేసీఆర్‌కు భారతరత్న కూడా తక్కువే, నోబెల్ బహుమతి ఇవ్వాలి: అలీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు శాంతిదూత బిరుదు, భారతరత్న ఇలా ఏది ఇచ్చినా తక్కువేనని, పద్నాలుగేళ్లు ఎక్కడా రక్తం చుక్క చిందకుండా అహింసనే ఆయుధంగా చేసుకుని పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిపెట్టారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు.

చదవండి: టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ శుభవార్త

అలాంటి మహాత్ముడికి నోబెల్‌ శాంతి పురస్కారం ఇవ్వాలన్నారు. తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీఏడీజేఏసీ) ఆధ్వర్యంలో కేసీఆర్‌కు శాంతిదూత బిరుదు ప్రదానోత్సవాన్ని బుధవారం రవీంద్రభారతిలో నిర్వహించారు.

KCR should get Noble prize for his agitation, Ali

కేసీఆర్‌ పక్షాన బిరుదును స్వీకరించిన మహమూద్‌ అలీ మాట్లాడారు. ఆటోడ్రైవర్లు ప్రయాణికులతో మర్యాదగా మెలగాలని, సంతృప్తికర సేవలను అందిస్తే సమాజంలో గుర్తింపు, గౌరవం దక్కుతాయన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Deputy Chief Minister Mahmood Ali said that Chief Minister K Chandrasekhar Rao is eligible for Noble prize.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి