హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రశాంతంగా ఉండేందుకే భార్యాపిల్లలను చంపా: హరీందర్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఒంటరిగా ప్రశాంతంగా జీవించాలనే ఉద్దేశంతోనే తాను భార్యను, ఇద్దరు పిల్లలను చంపినట్లు ట్రిపుల్ మర్డర్ కేసు నిందితుడు హరీందర్ గౌడ్ చెప్పారు. హైదరాబాదులోని మీర్‌పేటలో హరీందర్ తన భార్యను, పిల్లలను చంపిన విషయం తెలిసిందే.

Recommended Video

ట్రిపుల్ మర్డర్స్: అనుమానం, రెండు పెళ్ళిళ్ళు, కారణాలెన్నో !

మీడియా ముందుకు మీర్‌పేట ట్రిపుల్ మర్డర్ నిందితుడు: హత్యలపై ఏం చెప్పాడంటే?..మీడియా ముందుకు మీర్‌పేట ట్రిపుల్ మర్డర్ నిందితుడు: హత్యలపై ఏం చెప్పాడంటే?..

ఆర్థిక సమస్యల కారణంగా తన భార్య జ్యోతి (35), పిల్లలు అభితేజ్ (6, సహస్ర (4)లను హత్య చేసిన ల్యాబ్ టెక్నీషియన్ హరీందర్‌ను పోలీసులు అరెస్టు చేసి బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు.

 రెండేళ్లుగా సంపాదన లేదు...

రెండేళ్లుగా సంపాదన లేదు...

హరీందర్ పెట్టిన ల్యాబ్ రెండేళ్లుగా సరిగా పనిచేయడం లేదు. దాంతో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. మామనే ఆర్థికంగా ఆదుకుంటూ వస్తున్నాడు. దాంతో ప్రత్యామ్నాయం చూసుకోవాలని భార్య జ్యోతి అతనిపై ఒత్తిడి పెంచుతూ వచ్చింది.

ల్యాబ్ మూత పడింది

ల్యాబ్ మూత పడింది

మూడు నెలలుగా ల్యాబ్ మూతపడింది. దాంతో భార్యాభర్తల మధ్య గొడవలు తీవ్రమయ్యాయి. దాంతో భార్యను, పిల్లలను వదిలించుకోవాలని అనుకున్నాడు. వారిని చంపడానికి పథకం వేశాడు. ఒంటరిగా ప్రశాంతంగా జీవించాలనే ఉద్దేశంతో అందుకు పూనుకున్నాడు.

 వారిని ఇలా చంపేశాడు...

వారిని ఇలా చంపేశాడు...

ఉదయం తెల్లవారు జామున హరీందర్ భార్యను పడక గది నుంచి పిలిచి అకస్మాత్తుగా ఊపిరాడకుండా చేసి, గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత పడక గదికి వెళ్లి ఊపిరాడకుండా చేసి పిల్లలను హత్య చేశాడు

ఆ రోజు ఇలా జరిగింది...

ఆ రోజు ఇలా జరిగింది...

ఈ నెల 4వ తేదీ హైదరాబాద్ లోని జిల్లెలగూడ సుమిత్ర ఎన్‌క్లేవ్‌లో ట్రిపుల్ మర్డర్ సంఘటన చోటు చేసుకుంది. హరీందర్ విచక్షణను కోల్పోయి తన భార్య జ్యోతి, కుమారుడు అభిజిత్(6), కూతురు సహస్ర(4)లను దారుణంగా హత్య చేశాడు.

English summary
Dental technician M Harinder Goud's intention to "live alone peacefully" allegedly drove him to kill his wife and two children at his residence at Meerpet on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X