హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆమెకిచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీ రామారావు.. దివ్యాంగురాలైన ఓ యువ పెయింటర్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇటీవల మల్కాజ్‌గిరికి చెందిన దివ్యాంగురాలు షేక్ నఫీస్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను మంత్రి కేటీఆర్ సందర్శించారు.

ఆమెకు మాటిచ్చిన కేటీఆర్

ఆమెకు మాటిచ్చిన కేటీఆర్

మస్క్యూలార్ డిస్ట్రోసీ అనే వ్యాధితో బాధపడుతున్నప్పటికీ.. చిత్రకళను కొనసాగిస్తున్న నఫీస్‌ను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అభినందించారు. అన్ని విధాలా సాయం అందిస్తామని హామి ఇచ్చారు.

అధికారులకు ఆదేశం

అధికారులకు ఆదేశం

ఈ క్రమంలో ఆమెకు జీవితాంతం పెన్షన్ వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సాంస్కృతిక శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే ఆమె వైద్యానికి అవసరమైన సహాయాన్ని నిమ్స్‌లో అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

 నెలకు రూ.10వేల పింఛను

నెలకు రూ.10వేల పింఛను

మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రూ.10లక్షలు జాయింట్ అకౌంట్‌లో జమచేసిన అధికారులు.. నెలకు రూ.10వేల చొప్పున పింఛను వచ్చేలా ఏర్పాట్లు చేశారు.

కేటీఆర్ అభినందన

కాగా, కోరిన వెంటనే స్పందించి దివ్యాంగురాలిని ఆదుకున్న మంత్రి చందులాల్ తోపాటు సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, డైరెక్టర్ మామిడి హరికృష్ణను మంత్రి కేటీఆర్ అభినందించారు.

English summary
Known for his humanitarian interventions to help those who desperately need assistance and aid, IT and Industries Minister KT Rama Rao has yet again kept his word — this time to differently-abled artist Sheik Nafees, a resident of Malkajgiri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X