కొండా సురేఖ క్షమాపణలపై కేటీఆర్ రియాక్షన్ ఇదే..! భవిష్యత్తుపై జోస్యం...!
గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇవాళ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కొండా సురేఖ బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. దీనిపై కేటీఆర్ స్పందించారు. నిజం నిలకడ మీదే తేలుతుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. మొన్న ఒక వార్తాపత్రిక క్షమాపణ చెప్పిందని, ఈరోజు ఈ మేడం చెప్పిందని ఆయన సెటైర్లు వేశారు. ఇంకా క్షమాపణలు చెప్పే వాళ్లు చాలా మంది ముందు వరుసలో ఉన్నారంటూ సంకేతాలు ఇచ్చారు. తమ మీద ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేసే వారు భవిష్యత్తులో వరుసగా క్షమాపణలు చెప్తారని కూడా కేటీఆర్ జోస్యం చెప్పారు.
అంతకు ముందు కొండా సురేఖ.. కేటీఆర్ కు సారీ చెప్తూ ట్వీట్ చేశారు. ఇందులో ఆమె.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిపై గతంలో నేను చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలని అనుకుంటున్నానని తెలిపారు. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదన్నారు. ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసిందన్నారు. కేటీఆర్ గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం గాని నాకు ఎంతమాత్రం లేవని క్లారిటీ ఇచ్చారు.

రాజధానిలో తాగు నీటి సమస్య రాకూడదు: సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
తన వ్యాఖ్యలు వారిని గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని కొండా సురేఖ తెలిపారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ సారీని ఆమోదిస్తున్నట్లు కానీ, తిరస్కరిస్తున్నట్లు కానీ చెప్పకుండా కేటీఆర్ దాటవేశారు. ఆమె వ్యాఖ్యల్ని పరిశీలించి, తన లీగల్ టీమ్ తో మాట్లాడతానని మాత్రం హింట్ ఇచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ రాజకీయాలతో విసిగిపోయిన కొండా సురేఖ.. బీఆర్ఎస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే ఇలా కేటీఆర్ కు సారీ చెప్పారన్న ప్రచారం తెలంగాణలో జరుగుతోంది.













Click it and Unblock the Notifications
