హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏమన్నారు?: స్కూల్ ఫీజులు, డొనేషన్లపై ట్విట్టర్‌లో కేటీఆర్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారత్‌లో ప్రస్తుతం విద్యా, వైద్యం ప్రతి కుటుంబానికి ఎంతో భారమైందని ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించారు. తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు, డొనేషన్లపై నియంత్రణకు చర్యలు తీసుకుంటామని ఆయన ట్వీట్ చేశారు.

ఇప్పటికే నగరంలోని కొన్ని స్కూళ్లకు తెలంగాణ విద్యాశాఖ నోటీసులు జారీ చేసిందని ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. విద్యా, వైద్యం ప్రతి కుటుంబానికి భారమైందని, ఆ రెండింటిపై తాము తప్పకుండా దృష్టి సారిస్తామని ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మైక్రోమ్యాక్స్ మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఐటీ కంపెనీ యజమానులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Ktr tweet on school fee hike in telangana

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఆరు నెలల్లోనే ఉత్పత్పి ప్రారంభించిన మైక్రోమ్యాక్స్ కంపెనీని అభినందించారు. రూ.20 వేల కోట్ల పెట్టుబడులు రావడంతో సుమారు 37 వేల మందికి ఉపాధి లభించనుందని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ తయారీపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని అన్నారు. హైదరాబాద్ నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల సుమారు 13 అభివృద్ధి క్లస్టర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణలో పరిశ్రమలు స్థాపించాలనుకునే వారి కోసం టీఐపాస్ ద్వారా సింగిల్ విండో అనుమతులను అందిస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి పూర్తి మద్దతు అందిస్తామని అన్నారు.

కాగా, రూ.80 కోట్లతో రెండో యూనిట్‌ను మైక్రోమాక్స్ సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సంస్థ నుంచి 3500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.

English summary
Minister KT Ramarao tweet on school fee hike in telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X