హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నగరంలోని చెరువుల ప్రక్షాళనకు కార్యాచరణ.!స్వఛ్చ హైదరాబాదే లక్ష్యమన్న మేయర్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : హైదరాబాద్ నగరాన్ని స్వఛ్చ నగరంగా తీర్చిదిద్దేందుకు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి వ్యూహ రచన చేస్తున్నట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా పారిశుద్యంపై దృస్టి కేంద్రీకరించిన మేయర్ ఇప్పుడు నగరం చుట్టుపక్కల ఉన్న చెరువుల సుందరీకరణపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కలిసి మేయర్ నగరంలో ఉన్న చెరువుల పరిష్టితిని సమీక్షించారు.

స్వచ్చ హైదరాబాద్ కోసం శ్రమించాలి.. నగరంలో విస్త్రుతంగా పర్యటించిన మేయర్..

స్వచ్చ హైదరాబాద్ కోసం శ్రమించాలి.. నగరంలో విస్త్రుతంగా పర్యటించిన మేయర్..

హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఈ రోజు జూబ్లీహీల్స్ అసెంబ్లీ నియోజక వర్గంలోని ఆరవ డివిజన్ లోని పలు ప్రాంతాలలో పర్యటించారు. మొదటిగా షేకపెట్ కొత్త చెరువు ను సందర్శించి చెరువులో ఉన్న పూడికను, గుర్రపు డెక్క ను వెంటనే తొలగించాలని జోనల్ కమిషనర్ ను మరియు డిప్యూటీ కమిషనర్ ను ఆదేశించారు మేయర్ విజయలక్ష్మి. అంతే కాకుండా షేకపెట్ కార్పోరేటర్ మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ తో మాట్లాడిన మేయర్, మెడికల్ ఆఫీసర్ మరియ ముఖ్య ఎంటమాలజిస్టుతో కోఆర్డినేట్ చేసుకొని పనిని త్వరగా పూర్తి చేయవాలిసిందిగా ఆదేశించారు.

నగరంలోని చెరువులను సందరీకరించాలి.. కార్యాచరణ రూపొందించిన నగర మేయర్..

నగరంలోని చెరువులను సందరీకరించాలి.. కార్యాచరణ రూపొందించిన నగర మేయర్..

ఆ తర్వాత షేకపెట్ లోని బృందావన్ కాలనీ లోని ప్రజలు మేయర్ మాట్లాడుతూ కొత్త చెరువు కాంపౌండ్ వాల్ ని పునర్నిర్మిచటం కోసం తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకు గాను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తో మాట్లాడి సమస్యను పరిశీలించి త్వరో సమస్య పరిష్కారం అయ్యే దిశగా చర్యలు తీసుకోవాలని మేయర్ ఆదేశించారు. అలాగే షేకపెట్ కాలనీ లోని పలు ప్రాంతలలో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తీయవలసిందిగా అక్కడే పరిశుద్య అధికారులను విజయలక్ష్మి ఆదేశించారు.

స్వఛ్చ హైదరాబాద్ లక్ష్యంగా పనిచేయాలి.. అధికారులకు యాక్షన్ ప్లాన్ వివరించిన విజయ లక్ష్మి..

స్వఛ్చ హైదరాబాద్ లక్ష్యంగా పనిచేయాలి.. అధికారులకు యాక్షన్ ప్లాన్ వివరించిన విజయ లక్ష్మి..

ఆ తరువాత యుసుఫ్ గూడ లోని కమలాపురి కాలనీలో పేరుకుపోయిన చెత్తను చూసి పారిశుద్య అధికారులతో మాట్లాడి పేరుకుపోయిన చెత్తను తొలగించాలని అన్నారు. అదే ప్రాంతానికి చెందిన జోనల్ కమిషనర్ రవి కిరణ్ తో మాట్లాదుతూ పచ్చదనం పరిశుభ్రత గురించి తగు సూచనలు ఇచ్చారు. చెత్త పేరుకుపోయిన చోట త్వరగా తొలగించాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ డివిజన్ లోని కార్పోరేటర్ బండారి రాజకుమార్ తో మాట్లాడుతూ చెత్త లేకుండా చూడవలసిందిగా సూచించారు మేయర్ విజయలక్ష్మి.

నగరానికి ఓ బ్రాండ్ ఉంది.. దాన్ని కాపాడాలన్న జీహెచ్ఎంసీ మేయర్..

నగరానికి ఓ బ్రాండ్ ఉంది.. దాన్ని కాపాడాలన్న జీహెచ్ఎంసీ మేయర్..

ఆ తరువాత సోమాజిగూడలోని నాలను పరిశీలించి అందులో వున్న వ్యర్ధాలను తొలగించాలని, అంతే కాకుండా పూడికతీత పనులను సాద్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్పోరేటర్ వనం సంగీత యదవ్ తో మాట్లాడుతూ సోమాజిగూడ లోని పలు ప్రాంతాల్లో స్వయంగా పారిశుద్య అధికారులను సమన్వయం చేసుకుంటూ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసారు. వెంగల్రావ్ నగర్ లోని రోడ్డు మీద పేరుకుపోయిన చెత్తను త్వరగా తీయించి అక్కడ ఫుట్ పాత్ నిర్మాణ పనులను త్వరగా ప్రాంభించాలని జోనల్ కమిషనర్ ని ఆదేశించారు మేయర్.

ప్రైమరీ హెల్త్ సెంటర్ల సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇంటింటి ఫీవర్ సర్వే సకాలంలో పూర్తి చేయాలన్న మేయర్

ప్రైమరీ హెల్త్ సెంటర్ల సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇంటింటి ఫీవర్ సర్వే సకాలంలో పూర్తి చేయాలన్న మేయర్

రహమతనగర్ లోని పలు ప్రాంతాలలో పర్యటించి అక్కడ నాలా పెండింగ్ పనులను త్వరగా పూర్చి చేయాలని అధికారులను కోరారు. పక్కనే వున్న నటరాజ్ నగర్ ఏజీ కాలనీ లోని పేరుకుపోయిన చెత్తను తొలగించాలని అధికారులులను సూచించారు. తర్వాత బోరబండా లోని వినాయక రావునగర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను పర్యవేక్షించి మేయర్ అక్కడి డాక్టర్ తో మాట్లాడుతూ వాక్సినేషన్ తో పాటు పలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆశ వర్కర్స్ తో మాట్లాడి ఇంటింటి ఫీవర్ సర్వే సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. సర్వే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని మేయర్ విజయలక్ష్మి కోరారు.

English summary
City Mayor Gadwala Vijayalakshmi seems to be plotting to make Hyderabad a cleaner city. The mayor, who has been focusing on sanitation for the past few days, now seems to have created a special campaign on the beautification of ponds around the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X