హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీడీ విడుదల: 'గాంధీ మరోసారి పుట్టాలి' (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహాత్ముడు ఎంచుకున్న అహింస మార్గాన్ని ప్రపంచ దేశాలు ఆచరిస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి అన్నారు. మహాత్మాగాంధీ టెంపుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గాంధీజీ ఆలయాన్ని (నల్గొండ జిల్లా చిట్యాలలో) ఏర్పాటు చేయడంతో పాటు ఆయనపై రూపొందించిన ఆడియో సీడీ, మహాత్మాగాంధీ భక్తిగీతాల పుస్తకాన్ని, ఆలయ లఘు చిత్రాన్ని గురువారం బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో ఆవిష్కరించారు.

సీడీ విడుదల: గాంధీ ఎంచుకున్న మార్గం అహింస

సీడీ విడుదల: గాంధీ ఎంచుకున్న మార్గం అహింస

ఈ సందర్భంగా సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ ప్రకృతిలో మానవుడికి కావాల్సిన శక్తి ఉందని దాన్ని సాధించుకోవాలంటే ఆధ్యాత్మికత ఒక్కటే మార్గమన్నారు. గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

 సీడీ విడుదల: గాంధీ ఎంచుకున్న మార్గం అహింస

సీడీ విడుదల: గాంధీ ఎంచుకున్న మార్గం అహింస

'మహాత్మా గాంధీ-భక్తి గీతావళి' కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సుబ్బిరామిరెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, వై.వి. సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, ఎమ్మెల్సీ యాదయ్య పాల్గొన్నారు.

 సీడీ విడుదల: గాంధీ ఎంచుకున్న మార్గం అహింస

సీడీ విడుదల: గాంధీ ఎంచుకున్న మార్గం అహింస

గుత్తు సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పార్లమెంట్‌లో దాదాపు 300 మందికి పైగా సభ్యులు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, వారసత్వ రాజకీయాలు చేసే వారే ఉన్నారన్నారు. గాంధీ ఆచరించిన మార్గాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

 సీడీ విడుదల: గాంధీ ఎంచుకున్న మార్గం అహింస

సీడీ విడుదల: గాంధీ ఎంచుకున్న మార్గం అహింస

మరోసారి గాంధీ పుట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పుస్తక రచయిత దేవలపల్లి చెంచు సుబ్బయ్య, గుడి నిర్వాహకులు భూపాల్ రెడ్డి, గాంధీ గుడి ట్రస్టు ఛైర్మన్ ఎం.ఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

English summary
MP Subbarami Reddy launches CD on Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X