వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ చేతిలో కొత్త అస్త్రం..౩౦ రోజుల యాక్షన్ ప్లాన్ తో కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్న బీజేపీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కి అమిత్‌ షా || Amit Shah Likely To Visit Hyderabad

రానున్న రోజుల్లో తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ కి బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదగటానికి ప్రయత్నం చేస్తుంది. అందుకోసం బీజేపీ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. ఇక ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ను వెనక్కు నెట్టి , కేసీఆర్ పై, గులాబీ పార్టీపై దూకుడు చూపిస్తుంది బీజేపీ . లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలిచిన ఊపు మీద ఉన్న బీజేపీ పార్టీ బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది . ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సభ్యత్వ నమోదు చేసిన బీజేపీ టీఆర్ఎస్ పై యుద్ధం ప్రకటించింది . తెలంగాణాలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని తేల్చి చెప్తుంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్న బీజేపీ ఇప్పుడు ముప్పై రోజుల మాస్టర్ ప్లాన్ తో టీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టబోతుంది.

సెప్టెంబర్ 17 ను తెలంగాణా విమోచనా దినోత్సవం జరపాలని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన బీజేపీ

సెప్టెంబర్ 17 ను తెలంగాణా విమోచనా దినోత్సవం జరపాలని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన బీజేపీ

ఇక అప్పటి నుండి బీజేపీ నేతల జోరు మామూలుగా లేదు. మరోపక్క నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకోవటంతో బీజేపీ అధిష్టానం ఫోకస్ ఒక్కసారిగా తెలంగాణాపై పడింది. కేసీఆర్ ను గద్దె దించి వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలని ఇప్పటి నుండే యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టింది. రాం మాధవ్ , నడ్డా వంటి నేతల పర్యటన , అమిత్ షా, మోడీల ప్రత్యేకమైన దృష్టి వెరసి తెలంగాణా బీజేపీలో జవసత్వాలు వచ్చాయి. ఇంటర్ పరీక్షా ఫలితాల్లో అవకతవకల దగ్గర నుండి ఏ చిన్న అవకాశం దొరికినా బీజేపీ టీఆర్ఎస్ పై విరుచుకుపడుతుంది. ఇక తాజాగా ముప్పై రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంది బీజేపీ. తెలంగాణా ప్రభుత్వం సెప్టెంబర్ 17 ను తెలంగాణా విమోచనా దినోత్సవంగా నిర్వహించాలని మొదటి నుండి బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో టీఆర్ఎస్ మాత్రం మిత్ర పక్షం అయిన మజ్లిస్ పార్టీ కోసం ఈ విషయంలో సైలెంట్ గా ఉంటుంది. ఇక దీనిని అస్త్రంగా తీసుకుని బీజేపీ ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది.

పోలవరం చీఫ్ ఇంజనీర్ బదిలీ.. జగన్ సంచలన నిర్ణయం... ఇందుకే !!పోలవరం చీఫ్ ఇంజనీర్ బదిలీ.. జగన్ సంచలన నిర్ణయం... ఇందుకే !!

అమిత్ షా రానున్న నేపధ్యంలో సర్వత్రా ఆసక్తి .. అన్ని జిల్లాల్లోనూ విమోచనా కమిటీల ఏర్పాటు

అమిత్ షా రానున్న నేపధ్యంలో సర్వత్రా ఆసక్తి .. అన్ని జిల్లాల్లోనూ విమోచనా కమిటీల ఏర్పాటు


సెప్టెంబర్ 17 తెలంగాణా విమోచనా దినోత్సవాన్ని బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణా రాష్ట్రానికి వచ్చి నిర్వహించనున్నారు. ఈ లోపు ప్రతి జిల్లాలోనూ తెలంగాణా విమోచనా కమిటీలను ఏర్పాటు చేసి అన్ని వర్గాల వారిని కలుపుకుని రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించాలని బీజేపీ భావిస్తుంది. ఇక అందులో భాగంగా హైదరాబాద్ లో బీజేపీ తెలంగాణా విమోచనా కమిటీ పేరుతో అన్ని రంగాల వారినీ ఆహ్వానించి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది . అంతే కాదు తెలంగాణా విమోచనా దినోత్సవం నిర్వహించాలన్న డిమాండ్ తో టీఆర్ ఎస్ సర్కార్ ను ఇబ్బంది పెట్టబోతుంది. దీని కోసం 30 రోజుల కార్యాచరణ చేపట్టింది. ఈ సారి పెద్ద ఎత్తున టీఆర్ ఎస్ పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజల్లో తెలంగాణా విమోచనా దినోత్సవం జరపాల్సిన అవసరం తెలియజేసేందుకు నడుం బిగించింది.

గులాబీ దళంపై విమోచానాస్త్రం ... పార్టీ చేరికలకు ఆకర్ష మంత్రం

గులాబీ దళంపై విమోచానాస్త్రం ... పార్టీ చేరికలకు ఆకర్ష మంత్రం

ఇక వీటితో పాటు తెలంగాణా రాష్ట్రంలో బలపడుతున్న బీజేపీ ఇతర పార్టీల నుండి బీజేపీలోకి వచ్చే నేతలను ఆకట్టుకునే పనిలో కూడా బిజీగా వుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరితే తెలంగాణా సర్కార్ పై పోరాటం చెయ్యటానికి కాస్త బలం ఉంటుందని భావించి చాలా మంది నేతలు ఇటీవల బీజేపీ తీర్ధం పుచ్చుకుంటున్న సంగతి తెలిసిందే . ఇక అమిత్ షా రాష్ట్రానికి సెప్టెంబర్ 17 న రానున్న సందర్భంగా కూడా చేరికలకు రంగం సిద్ధం చేసుకుంటూనే మరో పక్క గులాబీ సర్కార్ పై విమోచానాస్త్రాన్ని ప్రయోగించాలని చూస్తోంది బీజేపీ .

English summary
BJP has been exploring all the political options to stay strong in the Telangana. BJP which has been constantly focussing on Telangana by various political means is likely to use its old political weapon. BJP has targeted TRS this time using September 17 as the Telangana Liberation Day. A 30-Days action plan has been prepared by the Saffron party. Home Minister Amit Shah will be visiting Hyderabad on September 17 and he is likely to conduct a huge public meeting. BJP cadre in Telangana has already prepared a ground plan to carry out during 30-days action plan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X