శిరీష కేసు: తేజస్వినిపై ఎలాంటి కేసు ఉండదన్న సీపీ, ఆమెతోను రాజీవ్‌కు శారీరక సంబంధం

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఆత్మహత్యగా వెలుగులోకి వచ్చి.. అనుమానాస్పద మృతిగా హత్యేమో అన్న అనుమానాలకు తావిచ్చిన బ్యుటీషియన్ శిరీష ఉదంతంలో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. శిరీషది ఆత్మహత్యేనని తేల్చిన పోలీసులు.. రాజీవ్, శ్రవణ్, ప్రభాకర్ రెడ్డిల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని నిర్దారించారు.

కేసులో ఏ-1గా శ్రవణ్, ఏ-2 రాజీవ్ లను చేర్చారు. అదే సమయంలో రాజీవ్ ప్రియురాలు తేజస్వినిపై ఎలాంటి కేసు ఉండదని కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. శిరీష ఆత్మహత్య ఉదంతంలో ఆమె ప్రమేయం ఎక్కడా లేదని, తనను మోసం చేసినందుకు రాజీవ్‌తో మాత్రమే గొడవ పడిందని చెప్పారు.

No case on tejaswini says cp mahender reddy

ఫేస్‌బుక్ ద్వారా తేజస్వినితో దాదాపు మూడేళ్లుగా రాజీవ్ కు పరిచయం ఉందని తెలిపారు. బెంగుళూరులో పనిచేసే తేజస్విని.. ఏడాది క్రితం హైదరాబాద్ వచ్చినప్పుడు రాజీవ్‌తో శారీరకంగా దగ్గరైందని, ఆ తర్వాత కూడా వారి సంబంధం కొనసాగిందని పేర్కొన్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని, ఇంతలోనే రాజీవ్ కు శిరీషతోను శారీరక సంబంధం ఉందన్న విషయం తెలిసి గొడవ తలెత్తిందన్నారు.

తేజస్వినికి తొలుత రాజీవ్-శిరీష సంబంధం గురించి తెలియదని సీపీ చెప్పారు. శిరీషతో సంబంధం గురించి తెలిసి గొడవలు మొదలయ్యాకే.. ఇదంతా జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో తేజస్విని సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించింది తప్పితే శిరీష మరణంతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని, అందువల్ల ఆమెపై ఎలాంటి కేసు ఉండబోదని అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hyderabad CP Mahender Reddy explained about the details in Sirisha's suspicious death at Jublihills. He said there is no case on Tejaswini.
Please Wait while comments are loading...