హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ, ఏపీల్లో స్కూల్స్: నారా లోకేష్, మంచు లక్ష్మీ మద్దతు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అనాథ పిల్లల చదువుకోసం ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎన్టీఆర్‌ మోడల్‌ పాఠశాలలను రెండు తెలంగాణ, ఆంధప్రదేవ్ రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున విస్తరించనున్నామని ఎన్టీఆర్‌ ట్రస్ట్ ట్రస్టీ, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తెలిపారు.

ఎన్టీఆర్‌ ట్రస్టు సహాయార్థం 'మెంటర్‌ ది హీరో' పేరుతో చిత్రకారుడు హరిశ్రీనివాస్‌ వేసిన చిత్రాల పద్రర్శనను ఆదివారం సాయంత్రం బేగంపేటలోని హెటెక్స్‌ కాకతీయలో లోకేష్‌ ప్రారంభించారు. లోకేష్‌ మాట్లాడుతూ నాలుగేళ్లుగా ట్రస్టు తరుఫున సేవ చేస్తున్నానన్నారు.

ఇప్పటికే హైదరాబాద్, వరంగల్, కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో పాఠశాలలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏపీ, తెలంగాణల్లోని జిల్లాకో పాఠశాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే 3వేలమంది తమ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. తమ పాఠశాలల ద్వారా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను మంచి పౌరులుగా తీర్చిద్దుతామని వెల్లడించారు.

కాగా, సినీ నటి మంచులక్ష్మి మాట్లాడుతూ.. ఇద్దరు పిల్లలకు మెంటర్‌గా ఉంటానని ప్రకటించారు. ట్రస్టు సీఓఓ మోహన్‌రావు మాట్లాడుతూ.. హరి చిత్రాల విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని అనాథ పిల్లల చదువుకోసం వినియోగిస్తున్నట్లు ప్రకటించారు. ట్రస్టు అధికారులు విష్ణువర్దన్‌, డా.విజయ్‌, ఐఐసీటీ డైరెక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

ఇది ఇలా ఉండగా, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు తగ్గిపోతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలని చేపట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. దీని ద్వారా తెలుగుదేశం పార్టీ తమ ప్రభావాన్ని పెంచుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

నారా లోకేష్

నారా లోకేష్

అనాథ పిల్లల చదువుకోసం ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎన్టీఆర్‌ మోడల్‌ పాఠశాలలను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జిల్లాకొకటి చొప్పున విస్తరించనున్నామని ఎన్టీఆర్‌ ట్రస్ట్ ట్రస్టీ, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తెలిపారు.

నారా లోకేష్

నారా లోకేష్

ఎన్టీఆర్‌ ట్రస్టు సహాయార్థం ‘మెంటర్‌ ది హీరో' పేరుతో చిత్రకారుడు హరిశ్రీనివాస్‌ వేసిన చిత్రాల పద్రర్శనను ఆదివారం సాయంత్రం బేగంపేటలోని హెటెక్స్‌ కాకతీయలో లోకేష్‌ ప్రారంభించారు.

నారా లోకేష్

నారా లోకేష్

లోకేష్‌ మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా ట్రస్టు తరుఫున సేవ చేస్తున్నానన్నారు.
ఇప్పటికే హైదరాబాద్, వరంగల్, కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో పాఠశాలలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

నారా లోకేష్

నారా లోకేష్

ఏపీ, తెలంగాణల్లోని జిల్లాకో పాఠశాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే 3వేలమంది తమ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. తమ పాఠశాలల ద్వారా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను మంచి పౌరులుగా తీర్చిద్దుతామని వెల్లడించారు.

English summary
With TDP’s political presence in Telangana drastically coming down after the division of the state and a series of defections from TDP to the ruling TRS, the TDP is now increasing NTR Trust activities in the new state to attract people towards the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X