ఔటర్‌పై ప్రమాదం: ట్రక్కును ఢీకొన్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు, పలువురికి తీవ్రగాయాలు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అత్యంత వేగంగా ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు.. ఓ ట్రక్కును ఢీకొంది. దీంతో బస్సు డ్రైవర్.. కేబిన్‌లో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

గంటపాటు శ్రమించి డ్రైవర్‌ను కేబిన్ నుంచి బయటికి తీశారు. తీవ్రగాయాలపాలైన అతడ్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సులోని పలువురు ప్రయాణికులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారందర్ని కూడా ఆస్పత్రులకు తరలించారు.

Outer ring road accident: driver and passengers injured

డ్రైవర్ నిద్ర మత్తు, అతివేగం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. కాగా, ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఔటర్‌పై జరిగిన మరో ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. తొండుపల్లి వద్ద రెండు ఆటోలు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు.

బంకర్ కూలి ఇద్దరు కార్మికుల మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా సింగరేణి ఉపరితల బొగ్గుగని కేంద్రంలో బంకర్‌ కూలి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. లారీలో బొగ్గు నింపుతుండగా.. అక్కడే పనులు చేస్తున్న పవన్‌(31), రఘుపాల్‌రెడ్డి(32) అనే కార్మికులపై బంకర్‌ కూలింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

తోటి కార్మికులు వెంటనే స్పందించి మృతదేహాలను వెలికి తీశారు. ఈ ప్రమాదంలో బొగ్గులోడ్‌ చేసేందుకు వచ్చిన టిప్పర్‌ వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ బంకర్‌ను మూడు నెలల క్రితమే నిర్మించారని.. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని.. కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A bus driver and passengers injured in an accident occurred at Hyderabad Outer ring road on Wednesday morning.
Please Wait while comments are loading...