వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్షన్ 8, ప్రత్యేక హోదా: బాబుని ఇరికించిన పవన్! కెసిఆర్‌లా అసాధ్యం?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నెల రోజులకు పైగా తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 అంశాలు రాజకీయ వేడిని రాజేశాయి. జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాలుగైదు రోజుల క్రితం బయటకు వచ్చి వాటికి తోడు.. ప్రత్యేక హోదా అంశాన్ని రాజేశారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రత్యేక హోదా చుట్టూ తిరుగుతోంది. పవన్ తమపై మండిపడటాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేదు. అయితే, వైసీపీ, కాంగ్రెస్, సీపీఐ వంటి విపక్షాల నుండి పవన్ కళ్యాణ్‌కు గట్టి మద్దతు లభించింది.

అదే సమయంలో సెక్షన్ 8 అమలు చేయాలనే డిమాండును పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. తాను సెక్షన్ 8కు పూర్తి వ్యతిరేకమని చెప్పారు. ఏపీ వైసీపీ, కాంగ్రెస్ నేతలతో పాటు మిగతా పార్టీలు అన్నీ కూడా హైదరాబాదులో సెక్షన్ 8 డిమాండును వ్యతిరేకిస్తున్నాయి.

Pawan Kalyan irks Chandrababu with special status

సెక్షన్ 8 విషయంలో టీడీపీ ఏకాకి అయిందనే చెప్పవచ్చు. పవన్ ప్రశ్నించాక... ప్రధానంగా సెక్షన్ 8, ప్రత్యేక హోదా గురించి చర్చలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో సెక్షన్ 8 అమలు చేస్తే కెసిఆర్ జాతీయస్థాయిలో ఉద్యమించాలని భావించారు. ప్రత్యేక హోదా పైన మాత్రం చంద్రబాబుకు అది సాధ్యం కాదనే చెప్పవచ్చు.

కేంద్రం సెక్షన్ 8 అమలు చేస్తే.. కెసిఆర్ ఢిల్లీలో నిరాహార దీక్ష చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. అన్ని రాష్ట్రాల మద్దతును కూడగట్టి జాతీయస్థాయిలో కేంద్రంపై ఉద్యమాన్ని ప్రకటించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, సెక్షన్ 8పై కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడం వేరే విషయం.

ఇప్పటికే ఓటుకు నోటు కేసుతో ఇబ్బంది పడుతున్న చంద్రబాబుకు.. పవన్ ప్రత్యేక హోదా డిమాండును తెరపైకి తీసుకు వచ్చి మరింత ఇరుకున పడేసారు. హోదా కోసం టీడీపీ డిమాండ్ చేస్తోంది. బీజేపీ ఇస్తానంటోంది. విపక్షాలు నిలదీస్తున్నాయి. అది వేరే విషయం.

పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడటంతో ఆ వాదన మరింత బలపడింది. తద్వారా బాబును చిక్కుల్లో పడేశారని చెప్పవచ్చు. అయితే సెక్షన్ 8పైన కెసిఆర్.. రాష్ట్రాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించినట్లుగా, చంద్రబాబుకు సాధ్యం కాదనే చెప్పవచ్చు.

సెక్షన్ 8 రాష్ట్రాల పైన కేంద్రం అజమాయిషీకి సంబంధించింది. కానీ, ప్రత్యేక హోదా మాత్రం లాభంతో కూడుకున్నది. ఈ నేపథ్యంలో ఏపీకి హోదా ఇస్తే తమకూ ఇవ్వాలని మిగతా రాష్ట్రాలు డిమాండ్ చేస్తాయి.

బాబుకు మిగతా రాష్ట్రాలను కూడగట్టే అవకాశంలేదు. ఇప్పటికిప్పుడు ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అలా అని, కేంద్రాన్ని నిలదీసేందుకు కూడా బాబుకు ప్రస్తుతానికి దారులు మూసుకుపోయాయని చెబుతున్నారు. ప్రత్యేక హోదా బాబుకు 'తాజా' చిక్కు అని చెబుతున్నారు.

English summary
Pawan Kalyan irks Chandrababu with special status
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X