పవన్‌ను బాగా చూసుకోండి: వారితో కేసీఆర్, సీఎం ఆఫర్‌కు నో చెప్పిన పవర్ స్టార్

Posted By:
Subscribe to Oneindia Telugu
Pawan & KCR's meeting : కేసీఆర్ - పవన్ భేటీ : 'తాట తీస్తా', 'ఆడి పేరేందిరా బై' !

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను బాగా చూసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన అనుచరులకు సూచించారు. సోమవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను జనసేనాని కలిసిన విషయం తెలిసిందే.

ఇరువురి మధ్య భేటీ చర్చకు దారి తీసింది. వారి భేటీ ఎంత సేపు జరిగింది? ఏం చర్చించుకున్నారు? అనే చర్చ సాగుతోంది. భేటీ అనంతరం పవన్ మాట్లాడినప్పటికీ, మీడియాలో ఇది జరిగిందని వార్తలు వచ్చినప్పటికీ.. ఈ భేటీకి మాత్రం అధిక ప్రాధాన్యతతో పాటు చర్చ సాగుతోంది.

షాకింగ్: 'ప్రగతి భవన్ వద్ద పవన్ కళ్యాణ్ పడిగాపులు', కిరణ్ రెడ్డిని లాగిన జనసేనాని

2 గంటల పాటు భేటీ

2 గంటల పాటు భేటీ

కేసీఆర్ - పవన్ కళ్యాణ్‌ల మధ్య రెండు గంటల పాటు భేటీ జరిగింది. రాజకీయ పార్టీ పని తీరుతో పాటు పలు అంశాలపై జనసేనాని తెలంగాణ సీఎం అభిప్రాయాలను, అనుభవాలను అడిగి తెలుసుకున్నారని తెలుస్తోంది. ఆయన నుంచి పలు సూచనలు కూడా తీసుకున్నారు.

డిన్నర్ ఆఫర్ చేసినా నో చెప్పిన పవన్ కళ్యాణ్

డిన్నర్ ఆఫర్ చేసినా నో చెప్పిన పవన్ కళ్యాణ్

ప్రగతి భవన్ వచ్చిన పవన్ కళ్యాణ్‌కు కేసీఆర్ డిన్నర్ ఆఫర్ చేశారు. రాత్రి భోజనం ఇక్కడే చేసి వెళ్లాలని సూచించారు. దానికి పవన్ కళ్యాణ్ సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్‌ను బాగా చూసుకోండి

పవన్ కళ్యాణ్‌ను బాగా చూసుకోండి

పవన్ కళ్యాణ్‌ను బాగా చూసుకోవాలని కేసీఆర్ భేటీ సమయంలో అక్కడ ఉన్న తన వారిని, తన అనుచరులకు సూచించారని తెలుస్తోంది. తద్వారా పవన్‌కు కేసీఆర్ కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం అదేనా

పవన్ కళ్యాణ్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం అదేనా

కేసీఆర్‌కు పవన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని, అలాగే జనసేనానికి ముఖ్యమంత్రి మంచి ప్రాధాన్యత ఇచ్చారని అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్‌కు యూత్‌లో ఉన్న క్రేజ్ కారణంగా దగ్గర అయితే దూరం పెట్టకపోవడమే మంచిదని కేసీఆర్ భావించి ఉంటారని అంటున్నారు.

తెలంగాణలో నాకూ బలం ఉంది

తెలంగాణలో నాకూ బలం ఉంది

కేసీఆర్‌తో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిఎంను కలిసిన అంశం, కిరణ్ కుమార్ రెడ్డి విద్యుత్ గురించి మాట్లాడినవి చెప్పడంతో పాటు తెలంగాణలో తనకు బలం ఉందని కూడా చెప్పారు. తెలంగాణలో తనకు అభిమానులు ఉన్నారని, బలం ఉందని, అదంతా డిఫరెంట్ అజెండా అన్నారు. కేసీఆర్‌తో భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదన్నారు.

కేసీఆర్‌తో భేటీ: పవన్ కళ్యాణ్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్

కేసీఆర్‌ను అడిగా

కేసీఆర్‌ను అడిగా

మొన్న రాజ్ భవన్లో తామిద్దరం మాట్లాడుకున్నామని, ఆ సందర్భంగా ఓసారి కలవాలని కేసీఆర్‌ను కోరానని, సరైన సందర్భంలో కలుద్దామని చెప్పారని కూడా పవన్ తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడతారని భావించానని, కానీ ఇప్పుడు 24 గంటల విద్యుత్ ఇవ్వడం ఆశ్చర్యం వేస్తోందన్నారు. దాని గురించి అడిగానని చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jana Sena founder Pawan Kalyan called on Telangana Chief Minister K Chandrasekhar Rao at Pragathi Bhavan here on Monday, providing much stuff to the rumour mills with regard to the political dynamics that might be witnessed on the Telugu land in the days to come.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి