రాజాసింగ్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. ఎంఐఎం నేతపై పీడీ యాక్ట్, చంచల్ గూడా జైలుకు తరలింపు
హైదరాబాద్ నగర పోలీసులు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం మరోమారు పి.డి యాక్ట్ ను ప్రయోగించారు. తాజాగా హిందూ, ముస్లిం వర్గాల మధ్య విబేధాలు సృష్టించి శత్రుత్వాన్ని పెంపొందించే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ కషఫ్ అని పిలువబడే ఎంఐఎం నాయకుడు సయ్యద్ అబ్దాహు క్వాద్రీపై హైదరాబాద్ పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ (PD) చట్టాన్ని ప్రయోగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Recommended Video

రాజా సింగ్ పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం నేత
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ నుండి సస్పెండ్ అయిన బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్‌పై దూకుడుగా 'సర్ తన్ సే జుదా' తల తెగి పడుతుంది అంటూ నినాదాలు చేయడంతో వివాదాన్ని రేకెత్తించినందుకు కషఫ్‌ను గురువారం ముందస్తుగా అరెస్టు చేశారు. ఆగస్ట్ 22 మరియు 23 మధ్య రాత్రి బషీర్‌బాగ్ సమీపంలోని పోలీస్ కమీషనర్ కార్యాలయం వెలుపల పెద్ద సంఖ్యలో ముస్లిం యువకులు గుమిగూడి, ఒక వీడియోలో ముహమ్మద్ ప్రవక్తను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలకు బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రవక్తను అగౌరవపరిస్తే శిరచ్ఛేదం అంటూ నినాదాలు, ఆపై హింసాత్మక ఘటనలు
నిరసన సమయంలో, 27 ఏళ్ల కషఫ్ 'గుస్తాక్ ఈ రసూల్ ప్రవక్తను అగౌరవపరిచే వ్యక్తికి శిరచ్ఛేదం మాత్రమే శిక్ష నినాదాలు చేస్తూ ఆగ్రహానికి గురైన ప్రజలను రెచ్చగొట్టాడు. అతని రెచ్చగొట్టే నినాదాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత, హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో అనేక విధ్వంసం మరియు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. మొఘల్‌పురా, షాహినాయత్‌గంజ్, భవానీ నగర్, హుస్సేనీ ఆలం ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లపై ఆందోళనకారులు దాడి చేశారు.

ఎంఐఎం నేతపై పీడీ యాక్ట్ పెట్టి చంచల్ గూడా జైలుకు పంపిన పోలీసులు
ఆందోళనకారులు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్‌పై రాళ్లతో దాడి చేశారు. ఒక హోటల్ నిర్వాహకుడిపై మరియు ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్‌పై కూడా దాడి చేశారు. 2016లో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీపై దాడి కేసులో కూడా కషఫ్ పాత్ర ఉంది. ఆ తర్వాత నాంపల్లి కోర్టు బెయిల్‌పై అతను విడుదలయ్యాడు. ఇక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి, మత విద్వేషాలను రగిల్చే ప్రయత్నం చేసిన ఎంఐఎం నేత కషఫ్ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు.

పీడీ యాక్ట్ తో గరిష్టంగా సవత్సరం జైలు శిక్ష
పి.డి యాక్ట్ ప్రకారం పేరుమోసిన నేరస్తులను ఒక సంవత్సరం పాటు జైలులో ఉండవచ్చు. ఈ చట్టం ద్వారా ఒక వ్యక్తిని కనిష్టంగా మూడు నెలల నుండి గరిష్టంగా 12 నెలల వరకు జైల్లో నిర్బంధించవచ్చు. ద్వేష పూరితమైన ప్రసంగాలు చేసేవారిని, మత ఘర్షణలకు కారణమైన కారణమయ్యే వారిని అల్లర్లకు పాల్పడే వారిని తీవ్రవాదులు, అంతర్రాష్ట్ర దొంగలు, హంతకులు, ఆన్లైన్ మోసాలకు పాల్పడే వారు, వ్యభిచార ముఠాలు, మాదకద్రవ్యాల ముఠాలపై ఈ పీడీ యాక్ట్ ను ప్రయోగిస్తారు పోలీసులు.












Click it and Unblock the Notifications