ఫిషింగ్ మెయిల్ ద్వారా బురిడీతో 8 లక్షలు స్వాహా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఫిషింగ్ మెయిల్ పంపి ఎన్ ఆర్ ఐ ఖాతా నుండి 8 లక్షల రూపాయాలను నలుగురు తీసుకొన్నారు. అయితే ఎట్టకేలకు తాను మోసపోయిన విషయాన్ని గ్రహించిన ఎన్ ఆర్ ఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆదారంగా పోలీసులు నిందితులను అెరెస్టు చేశారు.అయితే ప్రధాన నిందితుడు నైజీరియన్ మహ్మాద్ పరారీలో ఉన్నాడు.

హైద్రాబాద్ కూకట్ పల్లికి చెందిన ప్రవీణ్ కుమార్ ఖతార్ లోని పనిచేస్తున్నాడు. నగరంలోని ఐసీఐసీఐ బ్యాంక్ బ్రాంచీలో ఎన్ఆర్ ఐ ఖాతాను ప్రారంభించాడు. బాధితుడికి గత ఏడాది ఆగష్టులో బ్యాంక్ ఖాతాను అప్ డేట్ చేసుకోవాలని మెయిల్ కు ఓ ఫిషింగ్ మేసేజ్ వచ్చింది.

police arrested cheaters in hyderabad

దీంతో ఆయన ఐసీసీఐ ఖాతాకు సంబంధించిన యూజర్ ఐడీ, పాస్ వర్డ్ సహ అన్ని వివరాలను నమోదు చేశాడు. కొద్దిరోజుల తర్వాత ఆయన ఖాతా నుండి ముంబాయ్, కోల్ కతాలోని ఎన్ ఆర్ ఐ ఖాతాలకు 8 లక్షల నగదు ట్రాన్స్ ఫర్ అయినట్టుగా ఎస్ ఎం ఎస్ లు వచ్చాయి. ఈ ఎస్ ఎం ఎస్ చూసిన ప్రవీణ్ కుమార్ ఐసీఐసీఐ బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు కూడ ఆయన ఫిర్యాదు చేశారు. మెయిల్ ఐడీ, లావాదేవీలు చేసిన కంప్యూటర్ల ఐడి అడ్రస్ ల ద్వారా నలుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నైజీరియాకు చెందిన మహ్మద్ ప్రధాన నిందితుడుగా పోలీసులు గుర్తించారు.

అక్కడి నుండే ఇంటర్ నెట్ ప్రోటోకాల్ ద్వారా ఫిషింగ్ మేసేజ్ ను పంపించి వివరాలు తస్కరించారని పోలీసులు తేల్చారు. మహ్మద్ కు మరో నైజీరియన్ చినోస్ ఓజోర్, ముంబాయికి చెందిన ఆశోక్ రవి ఆరోరా, ఇంతియాజ్ సాధిక్ సహకరించారని ఏసీపీ జయరాం తెలిపారు. బ్యాంకు లావాదేవీలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
police arrested cheaters in hyderabad.four members sent to fishing mail nri praveen,. when they got details from fishing mail, they drawn 8 lakhs from parveen account.
Please Wait while comments are loading...