కుక్కని చూసి పారిపోతారు, మర్యాదగా భూమి ఇవ్వకుంటే: హీరోలపై కృష్ణయ్య సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సమాజాన్ని ప్రభావితం చేసే బలమైన సాధనం సినిమా అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీసీ నేత ఆర్ కృష్ణయ్య అన్నారు. తెర వెనుక అఘాయిత్యాలు సినీ పరిశ్రమకు సిగ్గుచేటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి చోటు చేసుకోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

'పవన్‌తో... మోడీ గురించి సింగపూర్‌లోనే కాదు, బాబు అన్ని దేశాల్లో చెప్తారు', రోజాకు నిమ్మల కౌంటర్

సినిమా పరిశ్రమలో కనిపించని వివక్ష, దోపిడీ, పీడన కొనసాగుతోందని ఆర్ కృష్ణయ్య అన్నారు. సినిమా పరిశ్రమను ప్రక్షాళన చేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఉందని ఆయన చెప్పారు. వివక్ష, దోపిడీ సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

హీరోలు కుక్కను చూసి కూడా పారిపోతారు

హీరోలు కుక్కను చూసి కూడా పారిపోతారు

హీరోలకు ధైర్యం, శక్తి, తెలివి లేదని ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు. హీరోలు అందరూ నిజ జీవితంలో కుక్కను చూస్తే కూడా పారిపోతారని ఎద్దేవా చేశారు.

హీరోల వద్ద వందల ఎకరాలు, మర్యాదగా ఇస్తే సరి

హీరోల వద్ద వందల ఎకరాలు, మర్యాదగా ఇస్తే సరి

తెలుగు సినిమా పరిశ్రమలో హీరోల వద్ద వందల ఎకరాలు ఉన్నాయని ఆరోపించారు. మర్యాదగా వాటిని ఇస్తే ఏమీ కాదని, లేదంటే గుడిసెలు వేయిస్తామని సినీ పరిశ్రమను హెచ్చరించారు.

 స్టూడియోల్లో పర్యవేక్షణ లేదు

స్టూడియోల్లో పర్యవేక్షణ లేదు

స్టూడియోలలో ఏం జరుగుతుందో పర్యవేక్షణ లేదని ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. సినిమా మంత్రిత్వ శాఖకు అసలు పట్టింపు లేకుండా పోయిందని విమర్శించారు. సినిమా పరిశ్రమలో వెలుగు చూస్తున్న ఆకృత్యాలపై ప్రభుత్వం కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.

 శ్రీరెడ్డి ఇష్యూ మొదలు

శ్రీరెడ్డి ఇష్యూ మొదలు

కాగా, ఇటీవల సినిమా పరిశ్రమలో దుమారం రేగుతోన్న విషయం తెలిసిందే. సినీ నటి శ్రీరెడ్డి మొదలు పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య ఈ అంశంపై స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BC leader and LB Nagar MLA R Krishnaiah hot comments on Telugu Film Industry on Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X